Entertainment
గాయకులు తమ గొంతుతో అభిమానులను ఆకట్టుకుంటారు. వీరిలో ఎవరు ధనవంతులో చూద్దాం.
బాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన గాయకుడు అరిజిత్ సింగ్ గొంతు లక్షల మంది హృదయాలను ఏలుతుంది. అతని వద్ద 414 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి.
సోను నిగమ్ అనేక చిత్రాల్లో పాటలు పాడాడు. అతని గొంతుకు విశేష అభిమానులు ఉన్నారు. సోను వద్ద 400 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని టాక్.
ఆస్కార్ అవార్డు గ్రహీత, గాయకుడు ఎ.ఆర్. రెహమాన్ తన భార్య సైరా బానుతో విడాకుల నేపథ్యంలో వార్తల్లో నిలిచారు. ఆయన వద్ద రూ.1728 కోట్ల ఆస్తులు ఉన్నాయి.
శ్రేయా ఘోషల్ కూడా బాలీవుడ్‌లోని ప్రముఖ గాయకులలో ఒకరు. ఆమె స్వరానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. శ్రేయా వద్ద 185 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని టాక్.
గుల్షన్ కుమార్ కుమార్తె తులసి కుమార్ కూడా బాలీవుడ్‌లోని అత్యంత ప్రజాదరణ పొందిన గాయకులలో ఒకరు. తులసి వద్ద 200 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయట.
సునిధి చౌహాన్ తన రాక్ స్వరానికి ప్రసిద్ధి చెందింది. సునిధి వద్ద 100 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని నెట్టింట వైరల్ అయ్యే వార్త. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాలి.
చాలా దశాబ్దాలుగా తన గొంతుతో మాయ చేస్తున్న ఆశా భోంస్లే అనేక అద్భుతమైన పాటలు పాడారు. ఆశా వద్ద 80 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని తెలుస్తుంది.
నేహా కక్కర్ కూడా బాలీవుడ్‌లోని అత్యంత ప్రజాదరణ పొందిన గాయకులలో ఒకరు. రిపోర్టుల ప్రకారం, నేహా వద్ద 40 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని అంటుంటారు.