Entertainment

టాప్ 10 హైయెస్ట్ గ్రాసింగ్ తమిళ సినిమాలు

10. ఎంత్రిరన్ (2010)

రజనీకాంత్ నటించి, ఎస్. శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారత్‌లో రూ. 157 కోట్ల నెట్ కలెక్షన్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 290.9 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది.

9. వారసుడు (2023)

భారత్‌లో రూ. 148.9 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 292.8 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిన ఈ సినిమాలో తలపతి విజయ్ ప్రధాన పాత్రలో నటించగా, వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు.

8. కబాలి (2018)

పా. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రజనీకాంత్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమా భారత్‌లో రూ. 154 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 294.2 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది.

7. బిగిల్ (2019)

తలపతి విజయ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకి అట్లీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 300.8 కోట్లు, భారత్‌లో రూ. 153 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది.

6. పొన్నియిన్ సెల్వన్ 2 (2023)

మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమా భారత్‌లో రూ. 164.8 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 343.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది.

5. విక్రమ్ (2022)

కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా భారత్‌లో రూ. 195.8 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 423.8 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది.

4. పొన్నియిన్ సెల్వన్ 1 (2022)

మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్రమ్, ఐశ్వర్యరాయ్, కార్తి, జయం రవి ప్రధాన పాత్రలు పోషించారు.ప్రపంచవ్యాప్తంగా రూ. 498.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది.

3. జైలర్ (2023)

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారత్‌లో రూ. 285.4 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 607.3 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది.

2. లియో (2023)

లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో థలపతి విజయ్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమా భారత్‌లో రూ. 287.1 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 615.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది.

1. 2.ఓ (2018)

రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రం. ప్రపంచవ్యాప్తంగా రూ. 660.3 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది.

శ్రీదేవి నుండి.. దివ్య భారతి వరకు.. హీరోయిన్ల మిస్టరీ మరణాలు!

ఈ బాలీవుడ్ స్టార్ ఏడాదిలో రెండు పుట్టినరోజులు ఎందుకు జరుపుకుంటాడు?

పాల‌మ్ముకుంటున్న బాలీవుడ్ బడా స్టార్లు వీరే

లైంగిక వేధింపుల కేసు ఎదుర్కొంటున్న ప్రేమమ్ హీరో ఆస్తుల గురించి తెలుసా