Entertainment

‘స్త్రీ 3’ లో అక్షయ్‌ కుమార్‌? రిలీజ్‌ డేట్‌ అప్పుడే?

‘స్త్రీ 3’ అప్‌డేట్

బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపిన 'స్త్రీ 2'  నుంచి మూడో భాగం రాబోతుందట. దర్శకుడు అమర్ కౌశిక్ స్వయంగా  ఈ విషయాన్ని వెల్లడించారు. 

‘స్త్రీ 3’ ఎప్పుడు రిలీజ్?

దర్శకుడు మాట్లాడుతూ, `మొదటి భాగం విడుదలైన 6 సంవత్సరాల తర్వాత స్త్రీ 2' వచ్చింది. కానీ 'స్త్రీ 3' విషయంలో అలా ఉండదు. దీన్ని మూడేళ్లలోపే తీసుకొస్తాం. 

‘స్త్రీ 3’లో అక్షయ్ ఉంటాడా?

అక్షయ్ కుమార్ 'స్త్రీ 2'లో అతిథి పాత్రలో కనిపించారు. అతను సర్కేట్ వారసుడిగా కనిపించాడు. కానీ  'స్త్రీ 3'లో కూడా ఆయన కనిపిస్తాడా అనేది ప్రశ్న. దీనిపై అమర్ కౌశిక్ మౌనం వీడారు.

అక్షయ్ ఎంట్రీపై దర్శకుడి మాట

"ఇది స్క్రిప్ట్‌పై ఆధారపడి ఉంటుంది. కథకు అవసరమైతే అతను (అక్షయ్ కుమార్) కనిపిస్తాడు, లేకపోతే  ఉండడు అని వెల్లడించారు.

‘స్త్రీ 2’లో హింట్ ఇచ్చారా?

'స్త్రీ 2'  సినిమా ఎండ్‌ క్రెడిట్స్‌లో అక్షయ్ కుమార్ మూడవ భాగంలో రాబోతున్నట్టుగా చూపించారు. అతను ప్రధాన విలన్‌గా తిరిగి వస్తాడని కూడా చెబుతున్నారు.

‘స్త్రీ 2’ కలెక్షన్స్ ఎంత?

ఆగస్టు 15న విడుదలైన 'స్త్రీ 2'  ఇండియాలో 520.73 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 736.5 కోట్లు వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రల్లో నటించారు.

టాప్ 10 హైయెస్ట్ గ్రాసింగ్ తమిళ సినిమాలు

శ్రీదేవి నుండి.. దివ్య భారతి వరకు.. హీరోయిన్ల మిస్టరీ మరణాలు!

ఈ బాలీవుడ్ స్టార్ ఏడాదిలో రెండు పుట్టినరోజులు ఎందుకు జరుపుకుంటాడు?

పాల‌మ్ముకుంటున్న బాలీవుడ్ బడా స్టార్లు వీరే