Entertainment

`సింగం అగైన్` స్టార్స్ ఎడ్యూకేషన్‌ వివరాలు

`సింగం అగైన్` బాక్సాఫీస్ వద్ద రచ్చ

అజయ్ దేవగన్ `సింగం అగైన్` బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. రెండు రోజుల్లో 85 కోట్లు వసూలు చేసింది. ఈ మూవీలో నటించిన స్టార్స్ ఎడ్యుకేషన్‌ వివరాలు చూద్దాం. 

1. అజయ్ దేవగన్

అజయ్ దేవగన్ సిల్వర్ బీచ్ హై స్కూల్ లో చదువుకున్నారు. మీఠీబాయి కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

2. కరీనా కపూర్

కరీనా కపూర్ జమ్నాబాయి నర్సీ స్కూల్, డెహ్రాడూన్ లోని వెల్హమ్ గర్ల్స్ స్కూల్ లో చదువుకున్నారు. మీఠీబాయి కాలేజీలో చేరినా గ్రాడ్యుయేషన్ పూర్తి చేయలేదు.

3. అక్షయ్ కుమార్

అక్షయ్ కుమార్ డార్జిలింగ్ లోని డాన్ బాస్కో హై స్కూల్ లో చదువుకున్నారు. గురు నానక్ ఖాల్సా కాలేజీలో చేరినా చదువు మానేశారు. థాయిలాండ్ లో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు.

4. అర్జున్ కపూర్

అర్జున్ కపూర్ ఆర్య విద్యా మందిర్ స్కూల్ లో చదువుకున్నారు. 11వ తరగతి ఫెయిల్ అయ్యాక చదువు మానేసి, నర్సీ మోంజీ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

5. టైగర్ ష్రాఫ్

టైగర్ ష్రాఫ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయలేదు. అమెరికన్ స్కూల్ ఆఫ్ బాంబేలో స్కూల్ చదువు పూర్తి చేసి, అమిటీ యూనివర్సిటీలో చదువుకున్నారు.

6. దీపికా పదుకొణే

దీపికా పదుకొణే బెంగళూరులోని సోఫియా హై స్కూల్ లో చదువుకున్నారు. ఇగ్నో లో గ్రాడ్యుయేషన్ కి చేరారు, కానీ మోడలింగ్ కోసం చదువు మానేశారు.

7. రణవీర్ సింగ్

రణవీర్ సింగ్ హెచ్.ఆర్. కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ లో చదువుకున్నారు. ఇండియానా యూనివర్సిటీ నుంచి ఆర్ట్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

8. సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్ 12వ తరగతి వరకు చదువుకున్నారు. సెయింట్ స్టానిస్లాస్ హై స్కూల్ లో చదువుకున్నారు. సెయింట్ జేవియర్స్ కాలేజీలో చేరినా  మధ్యలోనే మానేశారు.

ఆరాధ్య బచ్చన్ కి వారసత్వంగా వచ్చిన ఆస్తుల విలువెంతో తెలుసా?

తప్పక చూడాల్సిన సాయి పల్లవి 7 సూపర్ హిట్ మూవీస్, మిస్ అవ్వద్దు !

భూల్ భులైయా 3 vs సింగం అగైన్: ఓపెనింగ్ డే కలెక్షన్స్

అత్యధిక కరెంట్ బిల్లు కడుతున్న బాలీవుడ్ స్టార్ ఎవరో తెలుసా?