ప్రభుదేవా దర్శకత్వంలో శ్రీహరి, సిద్ధార్థ్, త్రిష నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషించారు. ప్రభుదేవా అతిథి పాత్రలో కనిపించారు.
నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఏ సినిమా ఒరిజినల్ మూవీ. అయితే సల్మాన్ ఖాన్, భాగ్యశ్రీ నటించిన 'మైనే ప్యార్ కియా' సినిమాకు దగ్గరగా ఉంటుంది.
ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో, హిందీతో సహా 9 భాషల్లో రీమేక్ అయ్యింది. వీటిలో 8 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.
హిందీలో 'రామయ్యా వస్తావయ్యా' పేరుతో ప్రభుదేవా దర్శకత్వంలోనే రీమేక్ చేశారు. సోనూ సూద్, గిరీష్ కుమార్, శృతి హాసన్ నటించారు.
38 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా 36 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇదే ఈ సినిమాకి వచ్చిన ఏకైక ఫ్లాప్ రీమేక్.
కన్నడలో 'నీనెల్లో నానల్లె', తమిళంలో 'ఉనక్కుమ్ ఎనక్కుమ్', బెంగాలీలో 'ఐ లవ్ యూ', మణిపురిలో 'నింగోల్ థజబా', ఒడియాలో 'సున చందైమో రూప చందై' పేర్లతో రీమేక్ అయ్యింది.
పంజాబీలో 'తేరా మేరా ఏక్ రిష్తా', బంగ్లాదేశ్‌లో 'నిస్సాష్ అమర్ తుమి', నేపాలీలో 'ద ఫ్లాష్ బ్యాక్: ఫర్కెరా హెర్దా' పేర్లతో రీమేక్ అయ్యింది. హిందీ తప్ప మిగతావన్నీ హిట్టే.
పుష్ప 2 దూకుడు: స్త్రీ 2ని దాటి, కల్కి వైపు
ప్రభాస్ ని బీట్ చేసిన హీరోయిన్..2024లో అత్యధికంగా సెర్చ్ చేసిన మూవీస్
2024లో అత్యధిక పారితోషికం తీసుకున్న విలన్లు
పుష్ప 2 నటులపై కోట్లు కుమ్మరించిన నిర్మాతలు!