Entertainment
కయాదు లోహర్ 21 ఏళ్ల వయసులోనే కన్నడ సినిమా ముగిల్‌పేటతో ఇండస్ట్రీలో పెట్టింది. ఆ తర్వాత మలయాళంలో పథోన్‌పత్తం నూత్తాండు అనే చిత్రంలో అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చారు.
ఈ బ్యూటీ 2022లోనే శ్రీ విష్ణు హీరోగా నటించిన అల్లూరి చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు.
ఈ బ్యూటీ అస్సాంలోని తేజ్‌పూర్‌లో జన్మించింది. ఎడ్యుకేషన్ విషయానికొస్తే ఈ చిన్నది బి.కాం గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. చదువు పూర్తయ్యాక మోడలింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
కయాదు లోహార్ తన కెరీర్‌ను ఒక జ్యువెలరీ పేజెంట్ కాంటెస్ట్‌తో ప్రారంభించింది. ఆ తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఎవర్ యూత్ ఫ్రెష్ ఫేస్ సీజన్‌లో విన్నర్‌గా నిలిచింది.
2021లో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినా తాజాగా విడుదలైన డ్రాగన్ మూవీతో లైమ్‌లైట్‌లోకి వచ్చిందీ బ్యూటీ. ఈ సినిమాలో తక్కువ నిడివి పాత్రలో నటించినా మంచి గుర్తింపును సంపాదించుకుంది.
కయాదు తెలుగులో క్రేజీ ఆఫర్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కయాదు లోహర్ హీరోయిన్ గా ఎంపికైందని టాక్ వినిపిస్తుంది.