Entertainment
దేశంలో చాలామంది నటీమణులకు ఎక్కువ ఆస్తులు ఉన్నాయి. కానీ, ఒకప్పుడు చాలా ధనవంతురాలైన నటిగా వెలుగొందిన సెలబ్రిటీ, మాజీ సీఎం జయలలిత.
జయలలిత అసలు పేరు జయలలిత జయరామ్. ఆమె ఫిబ్రవరి 24, 1948న కర్ణాటకలోని మేల్కోట్‌లో జన్మించారు. డిసెంబర్ 5, 2016న మరణించారు.
జయలలిత ఆస్తుల విలువ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఆమె సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆమె ఆస్తుల విలువ పెరిగింది.
1997లో సీబీఐ జయలలిత నివాసంలో సోదాలు చేసింది. అప్పుడు 188 కోట్ల ఆస్తి ఉందని చెప్పగా, అధికారులు మాత్రం 900 కోట్లకు అధిపతి అని ఆరోపించారు.
సీబీఐ రైడ్‌లో జయలలిత ఇంట్లో 28 కిలోల బంగారం, 800 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు.
అంతేకాకుండా, జయలలిత దగ్గర 10500 విలువైన చీరలు, 750 జతల చెప్పులు ఉన్నట్లు గుర్తించారు. ఇటీవల మొత్తం ఆస్తులను ప్రభుత్వానికి అప్పగించిన విషయం తెలిసిందే.
జయలలిత 1991 నుంచి 2016 వరకు 6 సార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మొత్తంగా 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు.
జయలలిత 1961లో బాలనటిగా సినిమాల్లో పరిచయమయ్యారు. 1992లో ఆమె చివరి చిత్రం `నీంగ నల్ల ఇరుకనుమ్` విడుదలైంది. ఆ తర్వాత పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్లిపోయారు.
ఒక్క ఫ్లాప్ లేని టాప్ 10 డైరెక్టర్లు! రికార్డులు చూస్తే షాక్
హైట్ ఎక్కువగా ఉన్న టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఇంతకీ ఎవరి హైట్ ఎంత?
బెడ్ షేర్ చేసుకుంటే ఛాన్స్ ఇస్తా అన్నారు: హీరోయిన్ సంచలన కామెంట్స్
రష్మిక మందన్న 8 కోట్ల బెంగళూరు ఇల్లు లోపల చూశారా?