Entertainment

అమితాబ్‌ బచ్చన్‌ ఒక్క రూపాయి పారితోషికం తీసుకున్న సినిమా ఏంటో తెలుసా?

అమితాబ్ బచ్చన్

1999లో, అమితాబ్ బచ్చన్ కంపెనీ ABCL నష్టాల్లోకి వెళ్ళడంతో ఆయన దివాళా తీశారు. ఆయన సినిమాలు కూడా బాగా ఆడలేదు.

యష్ చోప్రా దయను బిగ్ బి గుర్తుచేసుకున్నారు

దివాళా తీసినప్పటికీ, అమితాబ్ బచ్చన్.. యష్ చోప్రా పై అభిమానం, ఆయన తనకు అందించిన సహాయాన్ని దృష్టిలో పెట్టుకుని కేవలం 1 రూపాయికే సినిమా చేశాడు.

నిఖిల్ అద్వానీ బిగ్ బి-యష్ చోప్రా కథ చెప్పారు

దర్శకుడు నిఖిల్ అద్వానీ, ఓ ఇంటర్వ్యూలో అమితాబ్ బచ్చన్, యష్ చోప్రాల సంబంధం గురించి చర్చించి, వారిద్దరి సినిమాల గురించి ప్రస్తావించారు.

బిగ్ బి తన పారితోషికం అడిగినప్పుడు

'సిల్సిలా' సమయంలో, యష్ చోప్రా అమితాబ్‌ను ఆయన పారితోషికం గురించి అడిగారు. 'నేను ఇల్లు కొనాలి, కాబట్టి ఈసారి మంచి మొత్తం కావాలి' అని ఆయన బదులిచ్చారు.

బిగ్ బి ఒక్క రూపాయి అడిగినప్పుడు

'మొహబ్బతీన్' సమయంలో, యష్ జీ పారితోషికం గురించి అడిగినప్పుడు, బిగ్ బి, 'అప్పుడు నేను అడిగింది ఇచ్చారు. ఇప్పుడు ఒక్క రూపాయికే చేస్తా' అన్నారు. నిజంగానే చేశారు` అని నిఖిల్ చెప్పారు.

'మొహబ్బతీన్' బ్లాక్ బస్టర్

2000లో విడుదలైన 'మొహబ్బతీన్' బ్లాక్ బస్టర్. ఇది భారతదేశంలో రూ. 41.88 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 76.91 కోట్లు వసూలు చేసింది.

100 కోట్లకుపైగా పారితోషికం తీసుకుంటున్న 8 మంది స్టార్స్

పుష్ప 3 టైటిల్ ఇదే!

రష్మిక మందన్నా ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా? కార్లు, లగ్జరీ లైఫ్‌

2024లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన 10 భారతీయ చిత్రాలు