Entertainment
తెలుగు సినిమాల ద్వారా, సినీరంగంలో కథానాయికగా పరిచయమైన నటి రంభ.
1992-లో ఆమె నటించిన, 'Aa Okkati Adakku' చిత్రం విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది.
1993-లో 'ఉళవన్' చిత్రం ద్వారా తమిళంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది రంభ
తెలుగు తమిళంతో పాటు, సౌత్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది రంభ. అన్ని భాషల్లో ఆల్మోస్ట్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.
చిరంజీవి, బాలయ్య, వెంకటేష్ , నాగార్జున,చ విజయ్, అజిత్, కార్తీక్, మురళి వంటి అగ్ర హీరోల సరసన నటించించి రంభ.
తర్వాత హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ వంటి అనేక భాషల్లో నటించే అవకాశాలు వచ్చాయి.
75కి పైగా చిత్రాల్లో నటించిన రంభ, సినిమాలు తగ్గుతున్న టైమ్ లో శ్రీలంకకు చెందిన వ్యాపారవేత్త ఇంద్ర కుమార్‌ను వివాహం చేసుకున్నారు.
ఈ దంపతులకు ప్రస్తుతం ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లలు ఉన్నారు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక, మళ్ళీ సినీరంగంపై దృష్టి పెట్టారు.
అప్పుడప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్న రంభ తన నెరవేరని కోరిక గురించి చెప్పారు.
రంభకు పిల్లలంటే చాలా ఇష్టమట. అందుకే పెళ్లయ్యాక ఐదుగురు పిల్లల్ని కనాలని ఎంతో ఆశపడ్డారట.
కానీ ముగ్గురు పిల్లలు సిజేరియన్ ద్వారా జన్మించారు కాబట్టి, వైద్యుల సలహా మేరకు ముగ్గురు పిల్లలతో సరిపెట్టుకున్నట్లు చెప్పారు.