Cricket
భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యారు. ఆయన ఆట గురించే తప్ప వ్యక్తిగత జీవితం గురించి చాలామంది తెలియదు. ఆ విషయాలు తెలుసుకుందాం.
రవిచంద్రన్ అశ్విన్, ప్రీతి నారాయణన్ ప్రేమకథ పాఠశాలలో ప్రారంభమైంది. వారు 7వ తరగతి నుండి కలిసి చదువుకున్నారు.
క్రికెట్ అశ్విన్ భార్య సినీతారలకు ఏమాత్రం తీసిపోదు. వంకర్లు తిరిగిన ఆమె నల్లని జుట్టు, ఆకట్టుకునే ముఖ సౌందర్యం ఆమెను ప్రత్యేకంగా నిలుపుతాయి.
ప్రీతి, రవిచంద్రన్ అశ్విన్ నవంబర్ 13, 2011న వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు, అఖిరా, ఆధ్య.
మే 26, 1988న చెన్నైలో జన్మించిన ప్రీతి నారాయణన్ బి.టెక్ పూర్తిచేసారు. అశ్విన్ తో వివాహం తర్వాత ఆమె గృహిణిగా మారిపోయారు.
ప్రీతి సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు, భర్త అశ్విన్, పిల్లలతో కలిసున్న ఫోటోలనే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తారు. ఆమెకు 196k కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు.
ప్రీతి నారాయణన్ వస్త్రధారణ కూడా చాలా స్పెషల్ గా వుంటుంది. భారతీయ సాంప్రదాయం ప్రకారం చీర కట్టినా, పాశ్చాత్య దుస్తులు ధరించినా ఆమె అందం మరింత రెట్టింపు అవుతుంది.