Cricket

7వ తరగతిలోనే.. అశ్విన్ - ప్రీతి లవ్ స్టోరీ ఇది

భారత్-బంగ్లాదేశ్ టెస్టు హీరో అశ్విన్

బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్టులో భారత్ 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో రవిచంద్రన్ అశ్విన్ 113 పరుగులతో పాటు 6 వికెట్లు కూడా పడగొట్టి హీరోగా నిలిచాడు. 

అశ్విన్ కుటుంబం

టీమ్ ఇండియా ఆల్ రౌండర్ అశ్విన్ గురించి ప్రజలకు చాలా తెలిసి ఉండవచ్చు కానీ అతని భార్య-పిల్లల గురించి పెద్దగా తెలియదు.

అశ్విన్ భార్య పేరు ప్రీతి నారాయణన్

అశ్విన్ భార్య పేరు ప్రీతి నారాయణన్. అశ్విన్, ప్రీతి ప్రేమకథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రీతి 7వ తరగతి చదువుతున్నప్పుడు అశ్విన్‌తో ప్రేమలో పడ్డారు.

7వ తరగతి నుంచే అశ్విన్ ప్రేమ

ప్రీతి నారాయణన్ ఒక ఇంటర్వ్యూలో, మేము కలిసి పాఠశాలకు వెళ్ళాం. 7వ తరగతి నుండి ఒకరికొకరం తెలుసు. నేను మొదటి నుండి అతనితో ప్రేమలో ఉన్నానని చెప్పారు. 

అశ్విన్ క్రికెట్ కోసం వేరే స్కూల్‌కు

అయితే, అశ్విన్ క్రికెట్‌లో కెరీర్‌ కోసం మరొక స్కూల్ కు మారాడు. ఆ తర్వాత మేడు కలిసింది చాలా తక్కువని ప్రీతి చెప్పారు. 

చాలా ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి..

చాలా ఏళ్ల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నప్పుడు మళ్లీ అశ్విన్ కలిశాను. 

ప్రీతికి అశ్విన్ ఎలా ప్రపోజ్ చేశాడు?

అశ్విన్ నన్ను క్రికెట్ గ్రౌండ్‌కి తీసుకెళ్లి ప్రపోజ్ చేశాడు. నా చేయి పట్టుకుని జీవితంలో నిన్ను మాత్రమే కోరుకున్నాను. 10 ఏళ్లలో ఏమీ మారలేదని చెప్పినట్టు ప్రీతి తెలిపారు. 

2011లో అశ్విన్-ప్రీతి పెళ్లి

అశ్విన్, ప్రీతి 2011 నవంబర్ 13న వివాహం చేసుకున్నారు. ఈ జంట దక్షిణ భారత సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు.

ఇద్దరు కుమార్తెలు

అశ్విన్-ప్రీతిలకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2015లో పుట్టిన పెద్ద కుమార్తెకు అకీరా అనీ, వారి చిన్న కుమార్తె కు ఆద్య అని పేరు పెట్టారు.

టీమిండియా సాధించిన 6 కొత్త రికార్డులు ఇవే

దిగ్గజ క్రికెటర్లకు షాకిచ్చిన అశ్విన్

ఆల్ టైమ్ బెస్ట్ భారత వన్డే జట్టు ఇదే

థార్ నుండి బెంజ్ వరకు: యశస్వి జైస్వాల్ కార్ కలెక్షన్ గురించి తెలుసా?