business

ప్రపంచంలోనే హైస్పీడ్ తో పరుగులు పెట్టే టాప్ 10 రైళ్లు ఇవిగో

Image credits: Freepik

షాంఘై మాగ్లెవ్ - 460 కి.మీ./గం (చైనా)

చైనాలో నడుస్తున్న షాంఘై మాగ్లెవ్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలు. ఇది షాంఘై పుడాంగ్ విమానాశ్రయం నుండి లాంగ్యాంగ్ వరకు 30 కి.మీ దూరాన్ని కేవలం 7.5 నిమిషాల్లో చేరుకుంటుంది.

Image credits: wiki

CR400 ఫుక్సింగ్ - 350 కి.మీ./గం (చైనా)

చైనాకు చెందిన CR400 ఫుక్సింగ్ రైలు గరిష్ట వేగం 350 కి.మీ./గం. అయితే, టెస్టింగ్  సమయంలో, ఈ రైలు 420 కి.మీ./గం వేగాన్ని కూడా సాధించిందట.

Image credits: wiki

ICE3 - 330 కి.మీ./గం (జర్మనీ)

జర్మనీకి చెందిన ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (ICE) ప్రపంచంలోనే మూడవ వేగవంతమైన రైలు. దీని వేగం 330 కి.మీ./గం. ఇందులో 16 ఎలక్ట్రిక్ మోటార్లు ఉన్నాయి.

 

Image credits: wiki

TGV - 320 కి.మీ./గం (ఫ్రాన్స్)

ఫ్రాన్స్‌కు చెందిన TGV రైలు హై-స్పీడ్ రైలు టెక్నాలజీలో ఒక స్టాండ్ క్రియేట్ చేసింది. 2007లో TGV 574.8 కి.మీ./గం వేగంతో ప్రయాణించి రికార్డు సృష్టించింది.

Image credits: wiki

JR తూర్పు E5 - 320 కి.మీ./గం (జపాన్)

జపాన్ హై-స్పీడ్ రైలు శక్తిని1964లో ప్రపంచానికి పరిచయం చేసింది JR తూర్పు E5.  నేడు దాని షింకాన్సెన్ రైళ్లు 320 కి.మీ./గం వేగంతో నడుస్తున్నాయి.

Image credits: wiki

అల్ బోరాక్ - 320 కి.మీ./గం (మొరాకో)

మొరాకోలోని అల్ బోరాక్ ఆఫ్రికాకు చెందిన మొట్టమొదటి, ఏకైక హై-స్పీడ్ రైల్వే నెట్‌వర్క్. 2018 నవంబర్లో ప్రారంభించబడిన ఈ రైలు 320 కి.మీ./గం వేగంతో నడుస్తుంది.

Image credits: wiki

AVE S-103 - 310 కి.మీ./గం (స్పెయిన్)

AVE S-103 రైలు స్పెయిన్‌లోని వివిధ నగరాల మధ్య 310 కి.మీ./గం వేగంతో నడుస్తుంది. 2006లో, ఈ రైలు 404 కి.మీ./గం టెస్టింగ్ స్పీడ్  సాధించింది.

Image credits: wiki

KTX - 305 కి.మీ./గం (దక్షిణ కొరియా)

దక్షిణ కొరియాకు చెందిన KTX రైలు 305 కి.మీ./గం వేగంతో నడుస్తుంది. సియోల్, బుసాన్ నగరాల మధ్య దూరాన్ని కేవలం రెండు గంటల 15 నిమిషాల్లో పూర్తి చేస్తుంది.

Image credits: wiki

ట్రెనిటాలియా ETR1000 - 300 కి.మీ./గం (ఇటలీ)

ఇటలీకి చెందిన ట్రెనిటాలియా ETR1000 రైలు 300 కి.మీ./గం వేగంతో నడుస్తుంది. ఇది టెస్టింగ్ సమయంలో 394 కి.మీ./గం వేగంతో పరుగు పెట్టింది. 

Image credits: wiki

హరమైన్ హై స్పీడ్ రైల్వే

సౌదీ అరేబియాలోని మక్కా, మదీనా మధ్య నడిచే హరమైన్ హై-స్పీడ్ రైల్వే 300 కి.మీ./గం వేగంతో నడుస్తుంది. ఇది 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలలో కూడా సులభంగా పనిచేస్తుంది.

Image credits: wiki
Find Next One