business
కత్రినా కైఫ్ హెవీ డైమండ్ మంగళసూత్రం వేసుకుంది. దీనికి దగ్గరగా ఉండే డిజైన్‌ను మనం ఎంచుకోవచ్చు.
సింపుల్ లుక్ మంగళసూత్రం కావాలంటే దీపికా పదుకొనే వేసుకున్న ఈ డైమండ్ మంగళసూత్రం మంచి ఎంపిక. నార్మల్ స్టోన్ తో కూడా చేయించుకోవచ్చు.
సోనమ్ కపూర్ నల్ల పూసలు, డైమండ్ కలిగిన మంగళసూత్రం వేసుకుంది. ఈ డిజైన్ చాలా ట్రెండీగా, స్టైలిష్ గా ఉంటుంది.
ఆలియా భట్ చిన్న ఇన్ఫినిటీ డిజైన్ మంగళసూత్రం ధరించింది. తక్కువ నల్ల పూసలు, చైన్ కలిగిన ఈ మంగళసూత్రం చాలా బాగుంటుంది.
అంకితా లోఖండే అందమైన మంగళసూత్రం వేసుకుంది. 5 డైమండ్లు ఉన్న ఈ చైన్ చాలా స్టైలిష్ గా ఉంటుంది.
శిల్పా శెట్టి వేసుకున్న మంగళసూత్రం చాలా ఖరీదైంది. కానీ ఆ స్టైల్లో తక్కువ బడ్జెట్ లో కూడా చేయించుకోవచ్చు.
మంగళసూత్రం చాలా ప్రత్యేకమైంది. మంచి డిజైన్లు మీ లుక్ ని మరింత అందంగా మార్చేస్తాయి. ట్రెండీ డిజైన్లు ఎంచుకుంటే ఎప్పుడూ స్టైలిష్ గా కనిపించవచ్చు.