business

శివ్ నాడార్ రోజుకి ₹5.5 కోట్లు దానం

10- రోహిణీ నీలేకని

అత్యధికంగా దానం చేసే వారిలో 10వ స్థానంలో రోహిణీ నీలేకని ఉన్నారు. ఆమె 2022-23లో రూ.170 కోట్లు విరాళం ఇచ్చారు. అంటే ఆమె రోజుకు దాదాపు రూ.46 లక్షలు దానం చేశారన్నమాట.

9- సైరస్ పూనావాలా

సీరం ఇన్‌స్టిట్యూట్ అధిపతి సైరస్ పూనావాలా 2022-23లో రూ.179 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఈ లెక్కన ఆయన రోజుకు రూ.49 లక్షలు దానం చేశారు.

8- నందన్ నీలేకని

ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని 2022-23లో రూ.189 కోట్లు విరాళంగా ఇచ్చారు అంటే ఆయన రోజుకు దాదాపు రూ.51 లక్షలు దానం చేశారన్నమాట.

7- అనిల్ అగర్వాల్

వేదాంత గ్రూప్ అధిపతి అనిల్ అగర్వాల్ 2022-23లో రూ.241 కోట్లు విరాళంగా ఇచ్చారు ఈ లెక్కన ఆయన రోజుకు రూ.66 లక్షలు దానం చేశారు.

6- బజాజ్ ఫ్యామిలీ

2022-23లో బజాజ్ కుటుంబం రూ.265 కోట్లు విరాళంగా ఇచ్చారు. అంటే వారు రోజుకు రూ.72 లక్షలు దానం చేశారన్నమాట.

5- గౌతమ్ అదానీ

అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ 2022-23లో రూ.285 కోట్లు విరాళంగా ఇచ్చారు. అంటే ఆయన కూడా రోజుకు దాదాపు రూ.78 లక్షలు దానం చేశారన్నమాట.

4- కుమార్ మంగళం బిర్లా

బిర్లా గ్రూప్ అధిపతి కుమార్ మంగళం బిర్లా 2022-23లో రూ.287 కోట్లు విరాళంగా ఇచ్చారు. అంటే ఆయన రోజుకు దాదాపు రూ.78 లక్షలు దానం చేశారన్నమాట.

3- ముఖేష్ అంబానీ

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ 2022-23లో రూ.376 కోట్లు వివిరాళంగా ఇచ్చారు. అంటే ఆయన రోజుకు దాదాపు రూ.1 కోటి దానం చేశారన్నమాట.

2- అజీమ్ ప్రేమ్‌జీ

విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ దానం విషయంలో రెండో స్థానంలో ఉన్నారు. 2022-23లో ఆయన రూ.1774 కోట్లువిరాళంగా ఇచ్చారు. అంటే ఆయన రోజుకు రూ.4.86 కోట్లు దానం చేశారన్నమాట.

1- శివ్ నాడార్

భారతదేశంలో అత్యంత దాతృత్వం గల వ్యక్తి HCL టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్. ఆయన 2022-23లో రూ.2042 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఈ లెక్కన ఆయన రోజుకు రూ.5.5 కోట్లు దానం చేశారు.

డాగ్ వాకింగ్ జాబ్స్: నెలకు ₹80,000 సంపాదన, వివరాలు ఇవిగో

మీ దగ్గర రూ.2000 నోట్లు ఇంకా ఉన్నాయా? అర్జెంటుగా ఇక్కడ మార్చేసుకోండి

పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? ఈ 5 విషయాలు తెలుసుకోండి!

నెలకు రూపాయి కడితే చాలు: రెండు లక్షల బీమా మీకు ఎంతో రక్షణ