business

మష్రూమ్స్ ఇలా సాగు చేస్తే రూ.లక్షల్లో ఆదాయం

Image credits: Getty

మష్రూమ్ రకాలు

బటన్ మష్రూమ్, మిల్కీ మష్రూమ్, ఆయిస్టర్ మష్రూమ్స్ ఇలా ముఖ్యమైన 6 రకాల తినే పుట్టగొడుగులు ఇండియాలో పండిస్తారు. 

Image credits: Getty

ఉష్ణోగ్రత మెయింటెయిన్ చేయాలి

బటన్ మష్రూమ్స్ అయితే 18 డిగ్రీలు, మిల్కీ మష్రూమ్స్ అయితే 35 డిగ్రీలు, ఆయిస్టర్ అయితే 26 డిగ్రీల ఉష్ణోగ్రత మెయింటెయిన్ చేయాలి.

Image credits: Getty

హ్యుమిడిటీ తప్పనిసరి

గాలిలో 80 - 90% కన్నా ఎక్కువ శాతం తేమ ఉండేలా చూసుకోవాలి. ఒక మోస్తరు గాలి, వెలుతురు ఉండేలా చూసుకోవాలి. 

Image credits: Getty

మట్టి కేసింగ్ లో జాగ్రత్తగా ఉండాలి

బటన్, మిల్కీ మష్రూమ్స్ సాగు చేసేటప్పుడు మట్టి కేసింగ్ చేయాలి. మట్టిలో బ్యాక్టీరియా, క్రిములు ఉండకుండా 100 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఉడకబెట్టాలి.

Image credits: Getty

మష్రూమ్ విత్తనాలు

మష్రూమ్ విత్తనాలను స్పాన్ అంటారు. వీటిని కేంద్ర ఉద్యాన శాఖ కేంద్రమైన బెంగలూరు ICMR వంటి నమ్మకమైన చోట మాత్రమే తీసుకోెవాలి. ఎందుకంటే మష్రూమ్ ఫార్మింగ్‌లో ఇవే కీలకం.

Image credits: Getty

చిన్న రంధ్రాలు చేయడం మర్చిపోవద్దు

మిల్కీ మష్రూమ్ ఫార్మింగ్ లో గడ్డి బ్యాగ్స్ తయారీ చాలా కీలకం. ఇవి తయారు చేసేటప్పుడు కవర్లకు చిన్న రంధ్రాలు పెట్టడం మరిచిపోకూడదు. 

 

Image credits: Getty

ఎండ అస్సలు పనికిరాదు

తయారు చేసిన బెడ్లను ఎండ లేని చోట పెట్టాలి. కాంతి ఉండాలి కాని డైరెక్ట్ ఎండ తగలకుండా చూసుకోవాలి. అందులో గదిలో పెట్టి లైట్స్ ఏర్పాటు చేయాలి. 

Image credits: Getty

ఎక్కువ నీళ్లు చల్లకూడదు

మిల్కీ మష్రూమ్ సాగులో బెడ్స్ కట్ చేసి, మట్టితో కేసింగ్ చేసిన తర్వాత కచ్చితంగా ఉదయం, సాయంత్రం నీళ్ళు పిచికారీ చేయాలి. కాని ఎక్కువ చల్లితే బెడ్స్ పాడైపోతాయి. 

Image credits: Getty

రైతులకు గుడ్ న్యూస్: మీ ఖాతాల్లోకి డబ్బులు పడేది అప్పుడే

బాలికలకు రక్షణగా ఇన్ని చట్టాలున్నాయా?

ఇంతకంటే తక్కువకు మారుతి సుజుకి కార్లు దొరకవు: రూ.లక్షల్లో డిస్కౌంట్లు!

కొత్త కారు.. రూ.2 లక్షల వరకు డిస్కౌంట్ !