మీకెంతో ఇష్టమైన ఇంటిని అందంగా అలంకరించుకోవాలనుందా? దీనికోసం మీరు పెద్దగా ఖర్చు కూడా పెట్టక్కరలేదు. అదెలాగంటే..
1. చీరలతో కర్టెన్లు
మీ ఇంటిని అలంకరించడానికి ఖర్చు చేయకూడదనుకుంటే చీరలతో కర్టెన్లు తయారు చేయండి. కిటికీలు, తలుపులకు రంగురంగుల చీరలు అలంకరించండి.
2. వాడని వస్త్రాలతో కుషన్ కవర్లు
చాలాసార్లు ఇంట్లో ఉపయోగించని బట్టలు ఉంటాయి. వాటితో కుషన్ కవర్లు తయారు చేసుకోవచ్చు. ఇది మీ ఇంటికి క్లాసీ లుక్ ఇస్తుంది.
3. మొక్కలతో అలంకరణ
చాలామంది ఇంట్లో పచ్చదనాన్ని ఇష్టపడతారు. మీరు డ్రాయింగ్ లేదా డైనింగ్ రూమ్‌లో చిన్న చిన్న కుండీలలో మొక్కలు పెంచుకోవచ్చు. ఇది ఇంటి అందాన్ని మరింత పెంచుతుంది.
4. సోఫాకు బదులుగా పరుపులు
మీ ఇంట్లో సోఫా లేకపోతే దానికి బదులుగా నేలపై పరుపులు వేసి, కుషన్లతో అలంకరించండి. మూలలో పూల కుండీలు పెడితే ఇంకా అందంగా ఉంటుంది.
5. ఇంట్లో తయారుచేసిన క్రాఫ్ట్‌లు
ఇంట్లో తయారుచేసిన క్రాఫ్ట్‌లతో గదులను అలంకరించండి. ఆర్టిఫీషియల్ దీపాలు లేదా ఉన్నితో అలంకరణ వస్తువులు తయారు చేసి గోడలకు వేలాడదీయండి.
6. వాల్ హ్యాంగింగ్‌లు
మార్కెట్‌లో తక్కువ ధరకే అందమైన షోపీస్‌లు, వాల్ హ్యాంగింగ్‌లు దొరుకుతాయి. వీటితో కూడా మీ ఇంటి గోడలకు అందమైన లుక్ ఇవ్వవచ్చు.