business
EPF ఖాతాలో ఉద్యోగి జీతం నుండి 12% జమ అవుతుంది. అదే విధంగా అంతే మొత్తాన్ని యజమాని కూడా జమ చేస్తారు.ఇది ఒక సేవింగ్స్ ఖాతాలాగా పనిచేస్తుంది. దీనిపై ప్రభుత్వం వడ్డీ లభిస్తుంది.
ఉద్యోగి అత్యవసర పరిస్థితుల్లో EPF ఖాతా నుండి డబ్బును ఉపసంహరించుకోవచ్చు. ఇందుకోసం సరైన బ్యాంక్ ఖాతాను లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. లింక్ చేసుకున్న ఖాతాలోకి డబ్బులు నేరుగా పడతాయి.
ఒకవేళ మీరు తప్పు బ్యాంక్ ఖాతాను లింక్ చేసినట్లయితే లేదా దానిలో ఏదైనా తప్పు ఉంటే బ్యాంక్ అకౌంట్ వివరాలను కింది స్టెప్స్ ఫాలో అవ్వడం ద్వారా సరి చేసుకోవచ్చు.
ముందుగా EPFO పోర్టల్ లోకి వెళ్లాలి. మీ యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. "Manage" ట్యాబ్‌పై క్లిక్ చేసి, డ్రాప్-డౌన్ మెనూ నుండి "KYC" సెలక్ట్ చేసుకోవాలి.
మీ బ్యాంక్‌ను ఎంచుకుని, ఖాతా నంబర్, పేరు, IFSC కోడ్‌ను నమోదు చేయాలి. ఆ తర్వాత "సేవ్" బటన్‌పై క్లిక్ చేయాలి. యజమాని ఆమోదం కోసం వేచి ఉండాలి.
మీ యజమాని ఆమోదం పొందిన తర్వాత మీ బ్యాంక్ వివరాలు మారుతాయి. "Approved KYC" విభాగంలో ఈ సమాచారం కనిపిస్తుంది.
త్వరలో EPFO ATM నుండి నేరుగా డబ్బును ఉపసంహరించుకునే సౌకర్యాన్ని ప్రారంభించనుంది. దీంతో వెంటనే మీ పీఎఫ్ ఖాతాలో సొమ్మును విత్ డ్రా చేసునుకే అవకాశం లభిస్తుంది.