business

మీకు తెలియకుండా మీ ఆధార్ వాడేశారా? ఇలా తెలుసుకోవచ్చు..

ఆధార్ కార్డు ముఖ్యమైన డాక్యుమెంట్

ఆధార్ కార్డు భారతీయ పౌరులకు చాలా ముఖ్యమైన డాక్యుమెంట్. ఇందులో మీ పేరుతో పాటు చిరునామా, ఫోన్, వేలిముద్ర వరకు అన్ని వివరాలు ఉంటాయి. తప్పుడు చేతుల్లోకి వెళితే దుర్వినియోగం చేయవచ్చు.

ఆధార్ ఎక్కడ ఎలా వాడుతున్నారో తెలుసుకోవచ్చు

మీరు అలాంటి ఏవైనా సమస్యలను నివారించాలనుకుంటే, మీ ఆధార్ ఎక్కడెక్కడ ఉపయోగించబడిందో మీరు సులభంగా తెలుసుకోవచ్చు. దీని కోసం మీరు UIDAI వెబ్‌సైట్‌కి వెళ్లాలి.

స్టెప్-1

ముందుగా ఆధార్ వెబ్‌సైట్‌కి వెళ్లండి.

స్టెప్-2

ఆధార్ సర్వీసెస్ కింద ఆధార్ ఆథెంటికేషన్ హిస్టరీ ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి.

స్టెప్-3

తర్వాత మీ ఆధార్ నంబర్ వివరాలు ఎంటర్ చేయాలి. సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి Send OTP పై క్లిక్ చేయండి.

స్టెప్-4

ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP కోడ్ వస్తుంది, ఇక్కడ OTP ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.

స్టెప్-5

ఆ తర్వాత చూపించే పేజీలో తేదీ పరిధి, ఆథెంటికేషన్ రకాన్ని ఎంచుకోవాలి. మరోసారి ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు 6 నెలల సమాచారం లభిస్తుంది. దీంతో మీ ఆధార్ ఎక్కడ ఎప్పుడు ఉపయోగించారో తెలుస్తుంది.

ఆధార్ దుర్వినియోగమైతే ఏం చేయాలి

మీ ఆధార్ దుర్వినియోగం జరిగిందని మీరు భావిస్తే, మీరు 1947కు కాల్ చేయడం ద్వారా లేదా help@uifai.gov.inకు ఇమెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.