business

అబద్ధాన్ని కనిపెట్టే యంత్రం మీరు కూడా కొనుగోలు చేయవచ్చు

పాలిగ్రాఫ్ పరీక్ష

కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌ను అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు సంజయ్ రాయ్‌తో సహా 6 మంది నిందితులకు పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇది అబద్ధాన్ని కనిపెట్టే యంత్రం.

పాలిగ్రాఫ్ పరీక్ష అంటే ఏమిటి

నేరం జరిగినప్పుడు నిందితుడు చెప్పేది నిజమో, అబద్ధమో తెలుసుకోవడానికి పాలిగ్రాఫ్ టెస్ట్ చేస్తారు. అతడి శరీరానికి సెన్సార్స్ పెట్టి, వాటి నుండి వచ్చే సిగ్నల్‌ను రికార్డ్ చేస్తారు.

పాలిగ్రాఫ్ యంత్రం ఎక్కడ దొరుకుతుంది

ప్రెస్టో ఇన్ఫోసొల్యూషన్స్, మెడికామ్ రిలయబుల్ టెస్టింగ్ సొల్యూషన్స్ కంపెనీలు భారతదేశంలో పాలిగ్రాఫ్ యంత్రాలను తయారు చేస్తాయి. ఇవి ప్రధానంగా ప్రభుత్వ ఏజెన్సీల కోసం తయారు చేయబడతాయి.

యంత్రం అమ్మే సంస్థలు

అమెరికాకు చెందిన లాఫాయెట్ఇన్‌స్ట్రుమెంట్ కంపెనీ పాలిగ్రాఫ్ యంత్రాలు సరఫరా చేయడంలో ప్రపంచంలోనే టాప్. USAకి చెందిన స్టోల్టింగ్ కో., కీలర్ పాలిగ్రాఫ్ కూడా ఈ యంత్రాలు తయారు చేస్తాయి.

ఎవరైనా కొనొచ్చా

పాలిగ్రాఫ్ యంత్రాలను ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు కొనుగోలు చేస్తాయి. ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులు కూడా వీటిని కొనుగోలు చేయవచ్చు. అయితే సరైన కారణాన్ని తెలియజేయాలి. 

లైసెన్స్ అవసరమా

కొన్ని దేశాల్లో సాధారణ ప్రజలు పాలిగ్రాఫ్ యంత్రాన్ని కొనుగోలు చేయడానికి లైసెన్స్ పొందాలి. ప్రభుత్వం నుండి అనుమతి తీసుకోవాలి.

ధర ఎంత

పాలిగ్రాఫ్ యంత్రం బేసిక్ మోడల్ ధర రూ.2.5 లక్షల నుండి 4 లక్షల వరకు ఉంటుంది. అధునాతన డిజిటల్ పాలిగ్రాఫ్ యంత్రం రూ.8-12 లక్షల వరకు ధర పలుకుతోంది.

అనంత్ అంబానీ సంపద ఎంతో తెలుసా? అతని లగ్జరీ లైఫ్ ఇదే..

ప్రపంచంలోనే హైస్పీడ్ తో పరుగులు పెట్టే టాప్ 10 రైళ్లు ఇవిగో

రైతులకు కేంద్రం రూ.6 వేలు ఇస్తోంది: ఇలా అప్లై చేసుకోండి

ఇల్లు కొంటున్నారా? ఈ 7 విషయాలు అస్సలు మర్చిపోవద్దు