business
ఏ బంగారు గొలుసు తయారు చేయాలన్నా 100% బంగారం వాడలేరు. గొలుసు గట్టిగా ఉండాలంటే బంగారంతో కొంచెం లోహం కలపాలి.
గట్టి బంగారు గొలుసు కోసం చూస్తుంటే, 14 క్యారెట్ల బంగారు చైన్ ఎంచుకోండి. ఇలాంటి గొలుసుల్లో 58.3% స్వచ్ఛమైన బంగారం ఉంటుంది.
14 క్యారెట్ల బంగారు గొలుసుని ఏ వాతావరణంలోనైనా వాడుకోవచ్చు. చైన్ రంగు కొంచెం తగ్గితే పాలిష్ చేయించి చాలా ఏళ్లు వేసుకోవచ్చు.
18 క్యారెట్ల బంగారు గొలుసులో దాదాపు 75% స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. మిగిలిన 25% ఇతర లోహాలు ఉంటాయి.
22 క్యారెట్ల బంగారు చైన్ ను చాలా కాలం భద్రంగా ఉంచుకోవచ్చు. ఇందులో 91.67% ప్యూర్ గోల్డ్ ఉంటుంది.
ఏ క్యారెట్ల బంగారు చైన్ కొన్నా, అన్నిట్లో చాలా డిజైన్లు దొరుకుతాయి. మీ బడ్జెట్, రోజువారీ వాడకానికి తగ్గట్టు వేర్వేరు క్యారెట్లు తీసుకోవచ్చు.