business
నగరంలో ఉద్యోగం వదిలి, గ్రామంలో వ్యాపారం చేయాలనుకుంటే డెయిరీ బిజినెస్ మంచిది. దీనికి కొంత స్థలం, కొంత పెట్టుబడి అవసరం.
డెయిరీ బిజినెస్ ప్రారంభించడానికి రెండు, మూడు ఆవులు లేదా గేదెలు ఉండేంత స్థలం అవసరం.
స్థలం మీదే అయితే చాలా ఖర్చు తగ్గుతుంది. పశువుల ధరలు ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. 15 నుంచి 20 లీటర్ల పాలు ఇచ్చే మంచి గేదె ధర రూ.70 నుంచి రూ.90 వేల వరకు ఉంటుంది.
రూ.80 వేల ఖరీదు గల రెండు గేదెలు కొంటే రూ.1.50 లక్షల వరకు ఖర్చవుతుంది. పశువుల ఆహారం, ఇతర ఖర్చులతో నెలకు రూ.5 నుంచి రూ.6 వేలు ఖర్చవుతుంది.
మీ ప్రాంతంలో పాల ధరను బట్టి మీ ఆదాయం ఆధారపడి ఉంటుంది. స్థానిక సహకార సంస్థలకు పాలు విక్రయిస్తే తప్పకుండా మంచి ఆదాయం పొందవచ్చు.
గేదె పాలు సాధారణంగా లీటరు 65-70 రూపాయలకు అమ్ముడవుతాయి. రెండు గేదెలు 30 లీటర్ల పాలు ఇస్తే, రోజుకు 1950 రూపాయలు ఆదాయం వస్తుంది.
రోజుకు 1950 రూపాయల చొప్పున నెలకు దాదాపు 60,000 రూపాయల ఆదాయం వస్తుంది. ఖర్చులు 10 వేలు అనుకుంటే నెలకు 50 వేల వరకు లాభం ఉంటుంది.