దుమ్ము, మట్టి, పాత నీరు వల్ల కూలర్ చల్లదనం తగ్గుతుంది. కాబట్టి ప్రతి 10 నుండి 15 రోజులకు కూలర్ భాగాలు, ట్యాంక్, ఫ్యాన్ బ్లేడ్‌లను శుభ్రం చేయండి.
మీరు కూలర్‌లో AC లాంటి గాలిని కోరుకుంటే.. కూలర్‌లో నీటితో పాటు కొన్ని ఐస్ ముక్కలను కూడా వేయండి. దీంతో నీరు కూల్ అవుతుంది. గాలి కూడా చల్లగా వస్తుంది.
కూలర్ మూడు వైపులా ఉండే జల్లెడలను నాణ్యతమైనవి తీసుకోండి. మంచి కూలింగ్ ప్యాడ్‌లు ఎక్కువ కాలం చల్లని గాలిని ఇస్తాయి. గడ్డితో చేసినవి త్వరగా ఎండిపోతాయి.
కూలర్‌ను ఎప్పుడూ గది కిటికీ లేదా తలుపు వైపు ఉంచండి. ఇది గాలి ప్రసరణకు సహాయపడుతుంది. అప్పుడు మొత్తం గది చల్లగా ఉంటుంది. మూసివున్న గదిలో కూలర్ ఉంచడం మంచిది కాదు.
కూలర్ మోటార్ లేదా పంప్ స్లో అయినా కూడా గాలి ఫ్లో తగ్గిపోతుంది. కాబట్టి కూలర్ పంప్, మోటార్ సర్వీసింగ్ తప్పకుండా చేయించండి.
కూలర్ ఉన్న గదిలో ఎక్కువ లైట్లు వాడకండి. ఎందుకంటే లైట్లు గది ఉష్ణోగ్రతను పెంచుతాయి.
కర్పూరం సహజంగా చల్లగా ఉంటుంది. ఇది గాలి, నీరులో ఉండే వైరస్, బ్యాక్టీరియాలను తరిమేస్తుంది. నీటిలో కొంత కర్పూరం వేస్తే అది చల్లదనాన్ని ఇస్తుంది.
కూలర్ ముందు తడిగా ఉన్న వస్త్రం లేదా తడి కర్టెన్ వేలాడదీయండి. ఇలా చేస్తే కూలర్ గాలి చల్లగా ఉంటుంది. గది కూడా త్వరగా, ఎక్కువసేపు చల్లగా ఉంటుంది.