Astrology
ఆదివారానికి సూర్యుడు అధిపతి. సమస్త జగత్తుకు మూలాధారమైన సూర్యుడు ఈ రోజు జన్మించిన వారిపై ఎక్కువ ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు.
ఆదివారం పుట్టిన వారు చాలా అదృష్టవంతులు అని పండితులు చెబుతున్నారు. వీరిలో ఎన్నో ప్రత్యేక గుణాలు ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
ఆదివారం జన్మించిన వారు సున్నిత మనస్కులై ఉంటారు. వీరు పెద్దలను గౌరవిస్తారు. ఇతరులను అస్సలు ఇబ్బంది పెట్టాలనుకోరు.
ఈ రోజు పుట్టిన వారు ఏదో ఒక ఆశయంతో ముందుకు సాగుతారు. వీరిలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. కష్టపడి పని చేస్తారు.
ఆదివారం జన్మించిన వారు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా ఉండటానికి ఇష్టపడతారు. నలుగురిలో తమకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని కోరుకుంటారు.
ఈ రోజు జన్మించిన వారు ఉద్యోగం చేయడం కంటే వ్యాపారానికి మొగ్గు చూపుతారు. ఒకరి కింద పనిచేసే మనస్తత్వం వీరిలో ఉండదు.
ఈ వివరాలు కేవలం పలువురు పండితులు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.