బెడ్రూమ్ ఇంట్లో చాలా ముఖ్యమైన భాగం. ఈ గదిలో వాస్తు సంబంధిత 5 వస్తువులను ఉంచితే భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి ప్రేమ పెరుగుతుంది. ఆ 5 వస్తువులేంటో తెలుసుకోండి…
వాస్తు శాస్త్రం ప్రకారం, బెడ్‌రూమ్‌లో మాండరిన్ డక్ లాంటి లవ్ బర్డ్స్ జంట బొమ్మను ఉంచుకోవచ్చు. ఇవి ప్రేమకు చిహ్నాలు. వీటిని బెడ్‌రూమ్‌లో ఉంచితే ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది.
బెడ్‌రూమ్‌లో రెండు అందమైన పూల కుండీలను ఉంచడం వల్ల అక్కడ సానుకూల శక్తి ఉంటుంది. ఈ సానుకూల శక్తి భార్యాభర్తలను సంతోషంగా ఉంచుతుంది. వారి మధ్య గొడవలను తగ్గిస్తుంది.
బెడ్‌రూమ్‌లో రాధాకృష్ణుల చిత్రపటం ఉంచడం చాలా శుభప్రదం. రాధాకృష్ణులు శాశ్వతమైన, పవిత్రమైన ప్రేమకు చిహ్నం. వారి చిత్రపటాన్ని బెడ్‌రూమ్‌లో ఉంచితే దంపతులు సంతోషంగా ఉంటారు.
భార్యాభర్తల మధ్య గొడవలను ఆపడానికి బెడ్‌రూమ్‌లో సిరామిక్ కుండలో చిన్న చిన్న స్ఫటికాలను వేసి రెండు ఎర్ర కొవ్వొత్తులను వెలిగించండి. దీనివల్ల మీకు ప్రయోజనం కలుగుతుంది.