టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు ముగింపు...!!
దర్యాప్తులో భాగంగా అప్పుడే ఆబ్కారీ శాఖ సంచాలకులు అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో టాలీవుడ్కు చెందిన అనేక మందిని విచారించారు. వారి వాంగ్మూలం నమోదు చేశారు. మత్తు మందులు వాడుతున్నదీ, లేనిదీ శాస్త్రీయంగా నిర్ధారించేందుకు వీరిలో కొందరి గోళ్లు, వెంట్రుకలు సేకరించి ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు.
హైదరాబాద్ : సంచలనం సృష్టించిన Tollywood Drugs Case వ్యవహారంలో
Enforcement Directorate (ఈడీ) చేపట్టిన దర్యాప్తు తుస్సు మంది. మత్తుమందుల దిగుమతితో పాటు నిధుల మళ్లింపు వ్యవహారం నిగ్గు తేల్చేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. వీటికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో కేసు మూసివేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అవసరమైన చట్టపరమైన ప్రక్రియ ఆరంభించే అవకాశం ఉంది.
2017లో Excise Departmentనమోదు చేసిన కేసులతో టాలీవుడ్ మత్తుమందుల వ్యవహారం తొలుత తెరపైకి వచ్చింది, సుదీర్ఘంగా సాగిన ఈ దర్యాప్తులోనూ చెప్పుకోదగ్గ ఆధారాలు లభించలేదు. ఇప్పుడు ఈడీ దర్యాప్తు కూడా ఇలాగే ముగిసిపోనుంది.
నాలుగేళ్ల క్రితం అంటే 2017 జూలైలో ఆబ్కారీ శాఖ అధికారులు
Kelvin Markerans అనే వ్యక్తిని అరెస్టు చేసి అతడి నుంచి మత్తుమందులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో Telugu film industryకి చెందిన అనేకమందికి మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు అతను వెల్లడించారు. దాంతో కలకలం రేగింది.
దర్యాప్తులో భాగంగా అప్పుడే ఆబ్కారీ శాఖ సంచాలకులు Akun Sabharwal ఆధ్వర్యంలో టాలీవుడ్కు చెందిన అనేక మందిని విచారించారు. వారి వాంగ్మూలం నమోదు చేశారు. మత్తు మందులు వాడుతున్నదీ, లేనిదీ శాస్త్రీయంగా నిర్ధారించేందుకు వీరిలో కొందరి గోళ్లు, వెంట్రుకలు సేకరించి ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు.
అన్ని కోణాల్లో దర్యాప్తు తోపాటు సాక్షులను విచారించారు. దాదాపు మూడేళ్ళ పాటు దర్యాప్తు చేసినా మత్తు మందుల వాడకం పై ప్రాథమిక ఆధారాలు లభించలేదు. ఆబ్కారీ శాఖ దర్యాప్తు ముగిసిన తరుణంలో అకస్మాత్తుగా ఈడీ అధికారులు తెరపైకి వచ్చారు. డ్రగ్స్ వ్యవహారంలో మళ్ళీ కొత్తగా గత ఆగస్టులో కేసు నమోదు చేశారు. డ్రగ్స్ దిగుమతితో పాటు విదేశాలకు నిధుల మళ్లింపు కోణంలో దర్యాప్తు చేపట్టారు. దీంట్లో భాగంగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన డైరెక్టర్ Puri Jagannath, Ravi Teja, Rana, Charmi, Rakul Preet Singh వంటి 12 మందిని విచారించారు.
టాలీవుడ్ డ్రగ్స్ కేసు: తరుణ్‌పై ఈడీ ప్రశ్నల వర్షం.. నేటీతో 12 మంది సినీ ప్రముఖుల విచారణ పూర్తి
వారందరి బ్యాంకు లావాదేవీలు పరిశీలించారు. ఆగస్టు 31న మొదలైన ఈ విచారణ సెప్టెంబరు 22 వరకూ కొనసాగింది. అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపినా కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేసును మూసివేయాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, సెప్టెంబర్ 20న టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కోర్టుకు సమర్పించిన ఛార్జీషీట్ లో ఎక్సైజ్ శాఖ కీలక అంశాలను ప్రస్తావించింది. డ్రగ్స్ కేసును కెల్విన్ తప్పుదారి పట్టించే విధంగా విషయాలు ఉన్నాయని ఎక్సైజ్ శాఖ ఆరోపించింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలపై బలమైన ఆధారాలు లేవని ఎక్సైజ్ శాఖ ఛార్జీషీట్ లో పేర్కొంది.
సినీ తారలు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు డ్రగ్స్ అమ్మినట్టు కెల్విన్ వాంగూల్మం ఇచ్చినట్టుగా ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. అయితే కెల్విన్ ఇచ్చిన వాంగ్మూలం నమ్మశక్యంగా లేదని కోర్టుకు సమర్పించిన ఛార్జీషీట్ లో తేల్చి చెప్పింది. నిందితుడు కెల్విన్ చెప్పిన విషయాలు ఆధారాలుగా భావించలేమని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్, నటుడు తరుణ్ శాంపిల్స్ లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని ఫోరెన్సిక్ నివేదిక తెలిపింది.