తెలుగు తేజం పీవీ సింధుకి మరో ఓటమి... ఫ్రెంచ్ ఓపెన్ 2021 సెమీ ఫైనల్‌లో ఓడి...
French Open 2021: జపాన్‌కి చెందిన సయాక తకహాషీతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 21-18, 16-21, 12-21 తేడాతో మూడు సెట్ల పాటు పోరాడి ఓడిన పీవీ సింధు...
భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధు, ఫ్రెంచ్ ఓపెన్ 2021 టోర్నీలో ఒక్క అడుగు దూరంలో పతకాన్ని కోల్పోయింది. జపాన్‌కి చెందిన సయాక తకహాషీతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో మూడు సెట్ల పాటు పోరాడి ఓడింది పీవీ సింధు. 21-18, 16-21, 12-21 తేడాతో పీవీ సింధుని ఓడించిన వరల్డ్ 15 ర్యాంక్ షెట్లర్ సయాక తకహాషీ, ఫ్రెంచ్ ఓపెన్ 2021 వరల్డ్ టూర్ 750 టోర్నీ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది...
జపాన్ ప్లేయర్ అకానే యమగూచీ, దక్షిణ కొరియాకి చెందిన సియాంగ్ మధ్య జరిగే రెండో వుమెన్స్ సెమీ ఫైనల్‌లో విజయం సాధించిన వాళ్లు, ఫైనల్‌లో తకహాషీతో తలబడబోతున్నారు... పీవీ సింధు ఓటమితో ఫ్రెంచ్ ఓపెన్ 2021 టోర్నీలో భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ల ప్రస్థానం ముగిసినట్టైంది... జపాన్ ప్లేయర్ సయాక తకయాషీతో జరిగిన గత 8 మ్యాచుల్లో పీవీ సింధుకి ఇది నాలుగో ఓటమి కావడం విశేషం.
ఇదీ చదవండి: వెన్నెముక లేని వెధవలు, మతం పేరుతో దూషిస్తారా... మహ్మద్ షమీపై వచ్చిన ట్రోల్స్‌పై విరాట్ కోహ్లీ ఫైర్...
అంతకుముందు 8వ సీడ్ బుసానన్ ఒన్‌బాంరన్‌పాన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లో 21-14, 21-14 తేడాతో సునాయాస విజయం అందుకుంది పీవీ సింధు. టోక్యో ఒలింపిక్స్ 2020లో కాంస్య పతకం సాధించి, రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన మొట్టమొదటి భారతీయ మహిళా అథ్లెట్‌గా సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది పీవీ సింధు.
ఆ తర్వాత గత వారం డెన్మార్క్ ఓపెన్ 2021లో పాల్గొన్న భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, క్వార్టర్ ఫైనల్స్‌లో కొరియాకి చెందిన 8వ సీడ్ ప్లేయర్ యన్ సియాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో 11-21, 12-21 తేడాతో వరుస సెట్లలో ఓడింది. ఆ తర్వాత వారం కూడా బ్రేక్ లేకుండా ఫ్రెంచ్ ఓపెన్‌లో పాల్గొంది పీవీ సింధు...
ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీ ఫైనల్ దాకా అద్భుత విజయాలతో దూసుకొచ్చినప్పటికీ, పతకానికి ఒక్క అడుగు దూరంలో నిలిచింది పీవీ సింధు. ఫ్రెంచ్ ఓపెన్‌లో పీవీ సింధుకి ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఇంతకుముందు 2017లోనూ పీవీ సింధు, సెమీ ఫైనల్‌లోనే ఓడింది. అయితే 2017లో చైనా ప్లేయర్ చెన్ యూఫీతో జరిగిన మ్యాచ్‌లో 21-14, 21-14 తేడాతో వరుస సెట్లలో ఓడి నిష్కమించింది సింధు.
ఫ్రెంచ్ ఓపెన్‌లో మెన్స్ సింగిల్స్‌లో తలబడిన భారత మెన్స్ బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్య సేన్, క్వార్టర్ ఫైనల్‌లో పోరాడి ఓడాడు. వరల్డ్ నెంబర్ 35 ర్యాంకర్ హియో క్వాంగీతో జరిగిన క్వార్టర్స్‌లో 17-21, 15-21 తేడాతో పోరాడి ఓడాడు లక్ష్యసేన్.
లక్ష్యసేన్ ఓటమితో ఫ్రెంచ్ ఓపెన్ 2021 బరిలో మిగిలిన ఒకే ఒక్క భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు కాగా, సెమీస్‌లో ఆమె ఓటమితో భారత పోరాటం ముగిసినట్టైంది. ఫ్రెంచ్ ఓపెన్ 2021 టోర్నీ మెన్స్ సింగిల్స్‌లో తైవాన్‌కి చెందిన చో టిన్-చెన్, దక్షిణ కొరియాకి చెందిన హె క్వాంగ్- హీని 21-15, 21-17 తేడాతో ఓడించి ఫైనల్ చేరుకున్నాడు. జపాన్‌కి చెందిన కెంటో మొమోటా, కెంటా సునేయమ మధ్య జరిగే మరో సెమీస్‌లో గెలిచిన విజేతతో ఫైనల్‌లో టైటిల్ కోసం తలబడనున్నాడు టిన్ చెన్...