Maneka Gandhi biography childhood family education political life net worth key facts ksp

మేనకా గాంధీ : బాల్యం, విద్యాభ్యాసం, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం

దివంగత ప్రధాని ఇందిరా గాంధీ చిన్న కుమారుడు సంజయ్ గాంధీ సతీమణే ఈ మేనకా గాంధీ. 17 ఏళ్ల వయసులో మోడలింగ్‌లో తన తొలి బ్రేక్‌ను పొంది.. బాంబే డైయింగ్‌లో పనిచేశారు. సంజయ్ గాంధీని తొలిసారిగా డిసెంబర్ 14, 1973న తన మామ మేజర్ జనరల్ కపూర్ కాక్‌టెయిల్ పార్టీలో కలుసుకున్నారు. 1980లో సంజయ్ గాంధీ ఓ విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. అప్పుడు మేనకా గాంధీకి కేవలం 23 ఏళ్లు మాత్రమే. 1983లో మేనకా గాంధీని ప్రధాని అధికారిక నివాసం నుంచి బయటకు వెళ్లాల్సిందిగా ఇందిర ఆదేశించారు. మేనకా గాంధీ అజంగఢ్‌కు చెందిన రాజకీయ నాయకుడు అక్బర్ అహ్మద్‌తో కలిసి ‘‘ సంజయ్ విచార్ మంచ్ ’’ను ప్రారంభించారు. 1988లో జనతాదళ్,  1999లో బీజేపీలో చేరారు.