మాట్లాడితే బూతులు, తెలుగు రానప్పుడు యాంకరింగ్ చేయకూడదు.. సౌమ్య రావుపై రెచ్చిపోయిన కమెడియన్
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా యాంకర్ సుమ, హైపర్ ఆది, నూకరాజు, సౌమ్య రావు, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, రాంప్రసాద్ ఇతర కమెడియన్లు, బుల్లితెర సెలెబ్రిటీలతో దావత్ అనే షో ప్లాన్ చేశారు.
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా యాంకర్ సుమ, హైపర్ ఆది, నూకరాజు, సౌమ్య రావు, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, రాంప్రసాద్ ఇతర కమెడియన్లు, బుల్లితెర సెలెబ్రిటీలతో దావత్ అనే షో ప్లాన్ చేశారు. రీసెంట్ గా విడుదలైన ఈ షో ప్రోమో యూట్యూబ్ లో వైరల్ గా మారింది. సౌమ్య రావు జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలతో పాపులర్ అయింది.
యాంకర్ రష్మీ తరహాలోనే ఆమెకి తెలుగు సరిగ్గా రాదు. కానీ ఎలాగోలా మేనేజ్ చేస్తూ నెట్టుకొస్తోంది. కొన్నిసార్లు ఆమె మాట్లాడే తెలుగు డబుల్ మీనింగ్ గా, బూతులుగా మారిపోతున్నాయి. దీనితో సౌమ్యరావు ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. దావత్ ప్రోమోలో డైరెక్ట్ గానే సౌమ్య రావుపై కమెడియన్ నూకరాజు విరుచుకుపడ్డారు. తెలుగు సరిగ్గా మాట్లడడం చేతకాని వారు యాంకరింగ్ ఎందుకు చేయడం అంటూ దుమ్మెత్తి పోశాడు.
సౌమ్య రావు కూడా నూకరాజుకి ధీటుగా కౌంటర్ ఇచ్చింది. నా మాతృ భాష కన్నడ.. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇలా యాంకరింగ్ చేయగలుగుతున్నాను, ఎంతోకొంత తెలుగు మాట్లాడగలుగుతున్నాను అంటే చాలా గొప్ప విషయం అని సౌమ్య రావు తెలిపింది. నూకరాజు మాట్లాడుతూ మీరు 10 మాటలు మాట్లాడితే 8 బూతులే ఉంటున్నాయి అంటూ తీవ్రంగా విమర్శించాడు.
దీనితో సౌమ్యరావు కోపం కట్టలు తెంచుకుంది. మీరు కన్నడ ఇండస్ట్రీకి వెళ్లి కన్నడ నేర్చుకుని నాలాగా యాంకరింగ్ చేయగలరా అని అడిగింది. నూకరాజు బదిలిస్తూ నాకు వేరే భాష రాకుంటే అక్కడికి నేను వెళ్ళను అంటూ కౌంటర్ ఇచ్చాడు. భాష రాకుంటే అందులో యాంకరింగ్ చేయకూడదు అనేది నూకరాజు ఉద్దేశం. అలాంటప్పుడు నన్ను షోకి పిలవొద్దు, తెలుగు వారినే పిలుచుకోండి అంటూ సౌమ్య రావు గట్టిగా అరిచేసింది. వీళ్లిద్దరి మధ్య కంప్లీట్ గా అసలేం జరిగింది అనేది డిసెంబర్ 31న తెలియనుంది.
హైపర్ ఆది కూడా ఏదో విషయంలో గొడవ పడి ఛాలెంజ్ చేశాడు. అది నిరూపిస్తే తాను ఈటివి వదిలేసి వెళ్లిపోతానని తెలిపాడు. అరియనా, ఇమ్మాన్యూల్ మధ్య కూడా వివాదం భగ్గుమంది. తనపై దిక్కుమాలిన జోకులు వేయొద్దు అంటూ అరియనా.. ఇమ్మాన్యూల్ కి వార్నింగ్ ఇచ్చింది.