రోహిత్, ధోని, కోహ్లీల ఎలైట్ క్ల‌బ్ లో చేరిన జంజూ శాంస‌న్ !

Most sixes by Indian batter in T20s : జింబాబ్వేతో జ‌రిగిన చివ‌రి టీ20 మ్యాచ్ లో భార‌త్ సూప‌ర్ విక్ట‌రీ అందుకుంది. టీమిండియా విజ‌యంలో 4 స్థానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చిన సంజూ శాంసన్ ఒక‌ ఫోర్, 4 సిక్సర్ల సహాయంతో 45 బంతుల్లో 58 పరుగులతో కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. 
 

Most sixes by Indian batter in T20s : Sanju Samson Joins Rohit Sharma & MS Dhoni In Elite List During 5th Zimbabwe vs India T20I RMA

Most sixes by Indian batter in T20s : జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌లో ఉన్న భార‌త జ‌ట్టు త‌మ చివ‌రి ఐదో టీ20 మ్యాచ్ లో సూప‌ర్ విక్ట‌రీ అందుకుంది. దీంతో 4-1 తేడాతో సిరీస్ ను కైవ‌సం చేసుకుంది. ఆదివారం (జూలై 14) హరారేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జింబాబ్వేతో జ‌రిగిన ఈ మ్యాచ్ లో సంజూ శాంసన్ భారత్ విజ‌యంలో కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. జ‌ట్టు తరఫున టాప్ స్కోర్ గా నిలిచాడు. 29 ఏళ్ల వికెట్ కీపర్-బ్యాటర్ శాంస‌న్ మొత్తం 45 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్, 4 సిక్సర్ల సహాయంతో 58 పరుగులు చేశాడు. రియాన్ పరాగ్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 65 పరుగులు జోడించి భారత్ స్కోరును 20 ఓవర్లలో 167/6 చేర్చాడు.

శాంసన్ టీమిండియా త‌ర‌ఫున త‌న రెండో టీ20 ఫిఫ్టీని సాధించాడు. ఈ క్ర‌మంలోనే లెజెండరీ బ్యాట‌ర్లు ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల ఎలైట్ క్ల‌బ్ లో చేరాడు. టీ20ల్లో 300 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు బాదిన ఏడో భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు ఆడిన 276 మ్యాచ్‌ల్లో శాంసన్ 302 సిక్సర్లు కొట్టాడు.

1 బంతికి 13 పరుగులు.. ప్ర‌పంచ రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన టీమిండియా

టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాడిగా రోహిత్ శర్మ టాప్ లో ఉన్నాడు. ఇప్పటి వరకు ఆడిన 448 మ్యాచ్‌ల్లో 525 సిక్సర్లను బాదాడు. 399 టీ20ల్లో 416 సిక్సర్లు బాదిన విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ 338 సిక్సర్లతో మూడో స్థానంలో ఉండగా, అతని తర్వాత సురేశ్ రైనా (325), సూర్యకుమార్ యాదవ్ (322), కేఎల్ రాహుల్ (311) ఉన్నారు.

టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ప్లేయ‌ర్లు

రోహిత్ శర్మ - 525
విరాట్ కోహ్లీ - 416
ఎంఎస్ ధోని - 338
సురేష్ రైనా - 325
సూర్యకుమార్ యాదవ్ - 322
కేఎల్ రాహుల్ - 311
సంజు శాంసన్ - 302

పాకిస్థాన్‌ చిత్తు.. వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ ఛాంపియన్ గా భారత్

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios