మాధవ్ న్యూడ్ వీడియో వివాదం.. టీడీపీ జనసేన నేతలపై వైసీపీ మహిళా నేత ఫిర్యాదు
గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోలో తన ఫొటో మార్పింగ్ చేశారని ఆరోపిస్తూ వైసీపీకి చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జనసేన, టీడీపీ నాయకులపై ఆమె ఫిర్యాదు అందించారు.
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌కి సంబంధించిన న్యూడ్ వీడియోలో తన ఫొటోను మార్ఫింగ్ చేశారని కద్రి ప్రాంతంలోని గాండ్లపెంటకు చెందిన వైఎస్‌ఆర్‌సీపీ సోషల్ మీడియా వాలంటీర్ అనితారెడ్డి ఆరోపించారు. దీనికి తెలుగుదేశం, జనసేన పార్టీలే కారణం అంటూ ఆమె పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
నంద్యాలలో కానిస్టేబుల్ దారుణ హత్య, కిడ్నాప్ చేసి, కత్తితో వీపు, గుండెల్లో పొడిచి...
గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో గోరంట్ల మాదవ్ కు సంబంధించిన ఓ వీడియో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ వీడియోలో తన ఫోటోను ఉపయోగించి తనను అసభ్యంగా ట్రోల్ చేస్తున్నారని ఐదుగురు వ్యక్తులపై అనితారెడ్డి ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను హైలైట్ చేస్తున్నందుకే తనను టార్గెట్ చేశారని ఆ మహిళ తెలిపింది. ‘‘ వీడియోలో నా మార్ఫింగ్ ఫోటోతో సోషల్ మీడియాలో నన్ను మానసికంగా హింసించారు ’’ అని ఆమె చెప్పింది.
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురి మృతి...
కాగా హిందూపురం ఎంపీకి మద్దతుగా అనంతపురం, సత్యసాయి జిల్లాల కురుబ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. బీసీ నాయకుడు అయిన మాధవ్ పై కావాలనే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఆయన ప్రతిష్టను దిగజార్చేందుకు ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తున్నారని కనగానపల్లి జడ్పీటీసీ సభ్యుడు మారుతీ ప్రసాద్ ఆరోపించారు. మరోవైపు గోరంట్ల మాధవ్ సామాజికవర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కమ్మ సంఘం ఆధ్వర్యంలో శనివారం ర్యాలీ నిర్వహించారు.
ఆ బూతు వీడియోని ఏ ల్యాబ్‌కి పంపారు.. ఎవరు తీసుకెళ్లారు : గోరంట్ల మాధవ్ వ్యవహారంపై వర్ల రామయ్య
ఇదిలా ఉండగా.. అసలు వీడియోను పోలీసులు ఇప్పటి వరకు గుర్తించలేకపోయారని అధికారిక వర్గాలు తెలిపాయి. పోలీసులకు అది అందిన తర్వాత, ఏదైనా మార్ఫింగ్ జరిగిందా అనే దానిపై స్పష్టత పొందడానికి ఫోరెన్సిక్ పరీక్షలకు పంపుతామని వర్గాలు చెప్పాయి. కాగా ఈ కేసులో వాస్తవాలు వెల్లడించాలని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ డీజీపీని కోరారు.