కొన్ని టమోటాలను బాగా మెత్తగా చేసి, వాటిని ప్యూరీగా మార్చండి. ఒక చెంచా ఓట్స్ , పెరుగు వేసి బాగా కలపండి.
ఈ మిశ్రమాన్ని మీ ముఖం, మెడ వంటి నల్లటి ప్రదేశాలలో అప్లై చేసి, 20 నిమిషాలు అలాగే ఉంచి, చల్లటి నీటితో కడగాలి.
టమోటాలను బాగా రుబ్బి, టమోటా రసం వేసి, కొద్దిగా నిమ్మరసం , మూడు చెంచాల గంధం కలపండి.
టమాట, గంధంల పేస్ట్ ని, మీ మెడ , ముఖం మీద అప్లై చేయండి. 15-20 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై చల్లటి నీటితో కడగాలి.
టమోటాలను ఒక గిన్నెలో బాగా మెత్తగా చేసి, 50 మి.లీ. పాలు కలపండి. మీ ముఖం మీద ఐదు నిమిషాలు అలాగే ఉంచి నీటితో కడగాలి.
టమోటా రసాన్ని నిమ్మరసంతో కలిపి మీ ముఖం మీద అప్లై చేయండి. ఇది మీ ముఖం మీద బాగా గ్రహించిన తర్వాత, చల్లటి నీటితో కడగాలి.