Travel
భారతదేశంలో ఎక్స్‌ప్రెస్, గరీబ్ రథ్, వందే భారత్, వందే మెట్రో, విస్టాడోమ్, మహారాజా, MEMU, DEMU వంటి అనేక రైళ్ళు ఉన్నాయి. అన్ని రైళ్ళు వాటికవే ప్రత్యేకమైనవి.
DEMU ఫుల్ ఫాం డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్. అంటే ఇది డీజిల్ ఇంజిన్ ద్వారా నడుస్తుంది. చిన్న, దూర ప్రయాణాలకు DEMU రైళ్ళు ఉపయోగిస్తారు.
గంటకు 120 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. ప్రతి మూడు బోగీల తర్వాత ఒక పవర్ కోచ్ ఉంటుంది. ఈ రైలులో స్లీపర్ కోచ్, ఫస్ట్ AC, ఎగ్జిక్యూటివ్ క్లాస్ సౌకర్యాలు ఉంటాయి.
మెయిన్‌లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ అనేది MEMU ఫుల్ ఫాం. విద్యుత్తును ఉపయోగించి తక్కువ దూరం ప్రయాణించే రైలు ఇది అని అర్థం.
ప్రతి 4 బోగీల తర్వాత ఒక పవర్ కార్ ఉంటుంది. ఇది గంటకు గరిష్టంగా 160 కి.మీ వేగంతో ప్రయాణించగలదు.
MEMU రైళ్ళలో స్లీపర్, AC, ఫస్ట్ క్లాస్, సెకండ్ AC, చైర్ వంటి అనేక సౌకర్యాలు ఉంటాయి.