Travel
భారతదేశంలో వేలకొద్దీ పర్యాటక ప్రదేశాలు ఉన్నప్పటికీ, చాలా మందికి తెలియని 5 ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అరుణాచల్ ప్రదేశ్‌లో జీరో వ్యాలీ ఉంది. ప్రశాంతత, పచ్చని పొలాలు, గ్రామాలు, ప్రత్యేకమైన అపటాని గిరిజన సంస్కృతి పర్యాటకులను కట్టిపడేస్తుంది.
కర్ణాటకలో గోకర్ణ ఉంది. అందమైన బీచ్‌లకు కూడా ఇది ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మహాబలేశ్వర దేవాలయాలు చూడటానికి చాలా బాగుంటాయి.
హిమాచల్ ప్రదేశ్‌లో ఈ స్పితి వ్యాలీ ఉంది. ఇక్కడ పురాతన మఠాలు, ఎత్తైన కొండ దారులు, ప్రకృతి అందాలు మైమరపిస్తాయి. మోడ్రన్ లైఫ్ స్టైల్ కి దూరంగా ఈ గ్రామాలు ఉండటం విశేషం.
అస్సాంలో బ్రహ్మపుత్ర నదిలో ఉన్న మజులి ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపం. ఇక్కడ సంస్కృతి, ప్రత్యేకమైన పండుగలు, ప్రకృతి అందాలకు ఎవరైనా మంత్రముగ్ధులవుతారు.
తీర్థన్ వ్యాలీ హిమాచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లాలో ఉంది. స్వచ్ఛమైన నదులు, అందమైన దారులు, పచ్చని పచ్చిక బయళ్లకు ఇది ఫేమస్.