Spiritual
రాములవారి పుట్టినరోజును రామనవమిగా దేశ వ్యాప్తంగా భక్తిగా, ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం రామనవమి ఏప్రిల్ 6, 2025న జరుపుతారు.
శ్రీరాముడు గొప్ప రాజు మాత్రమే కాదు, మంచి జీవితం గడపడానికి స్ఫూర్తినిచ్చే వ్యక్తి కూడా. ఆయన గుణాలు జీవితాన్ని సఫలం చేస్తాయి.
శ్రీరాముడు జీవితాంతం నిజాయితీగా ఉన్నాడు. అబద్ధం, మోసం చేయలేదు. నిజాయితీగా ఉంటే మనకు నమ్మకం, గౌరవం లభిస్తాయి.
రాజు అవ్వాలన్నా, అడవులకు వెళ్లాలన్నా, శ్రీరాముడు ప్రతి పరిస్థితిలో తన బాధ్యతలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చాడు. మన బాధ్యతలను కూడా నిజాయితీగా నిర్వర్తించాలి.
శ్రీరాముడు రాజుగా ఉన్నా, అడవుల్లో ఉన్నా ఎప్పుడూ గర్వపడలేదు. వినయం మనల్ని గొప్పవారిగా చేస్తుంది. ప్రజల గౌరవాన్ని పొందేలా చేస్తుంది.
రాజ్య సుఖాన్ని వదులుకుని అడవులకు వెళ్లడం, తల్లిదండ్రుల మాట వినడం శ్రీరాముని త్యాగానికి నిదర్శనం. మనం కూడా స్వార్థాన్ని వదిలి ఇతరుల కోసం ఏదైనా చేయాలి.
14 ఏళ్ల వనవాసం, సీతమ్మ తల్లిని ఎత్తుకుపోవడం, రావణుడితో యుద్ధం ఇలా ప్రతి పరిస్థితిలో శ్రీరాముడు ఓర్పుతో ఉన్నాడు. కష్ట సమయంలో సహనం ఉంటే విజయం సాధించవచ్చు.
లక్ష్మణుడు, భరతుడితో శ్రీరాముడు చూపిన ప్రేమ ఆదర్శం. మనం కూడా మన కుటుంబంతో ఇలాగే ప్రేమగా ఉండాలి.
నిజమైన రాజులా శ్రీరాముడు ఎప్పుడూ న్యాయం వైపే నిలిచాడు. మనం కూడా ఎవరికీ తేడా లేకుండా న్యాయంగా ఉండాలి.
రావణుడిని ఓడించినా, శ్రీరాముడు అతనిలోని మంచి గుణాలను మెచ్చుకున్నాడు. మనం కూడా ఇతరుల తప్పులను క్షమించి, వారిలోని మంచిని చూడాలి.
శ్రీరాముడు ప్రతి పరిస్థితిలో ధర్మాన్ని పాటించాడు. అధర్మ మార్గాన్ని ఎంచుకోలేదు. మంచి, చెడు మధ్య ఎప్పుడూ మంచినే ఎంచుకోవడం మనం కూడా నేర్చుకోవాలి.
శ్రీరాముడిని ‘మర్యాద పురుషోత్తముడు’ అంటారు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ ఆదర్శ జీవితాన్ని గడిపాడు. మనం కూడా మన హద్దులను, నీతిని పాటించాలి.