Spiritual
హిందూ ధర్మంలో ఎవరైనా చనిపోతే వారి శరీరాన్ని పాడెపై పడుకోబెట్టి శ్మశానానికి తీసుకెళ్తారు. దీన్నే శవయాత్ర అంటారు.
మీరు కూడా ఈ దృశ్యాన్ని చూసి ఉంటారు. కానీ అలాంటప్పుడు ఏం చేయాలో చాలా మందికి తెలియదు. చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలంటే ఏం చేయాలి?
దారిలో శవయాత్ర కనిపిస్తే వెంటనే చేతులు జోడించి మృతుడి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించాలని పండితులు చెబుతున్నారు.
మీరు ఇంట్లో ఉన్నప్పుడు శవయాత్ర డప్పుల శబ్దం వినిపించినా ఇలాగే చేయాలి. దీని వల్ల మృతుడి ఆత్మకు శాంతి లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
మనిషిగా మృతుడి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తే మీరు మీ సామాజిక బాధ్యతను నెరవేర్చినట్లు అవుతుంది. మీ ఇంట్లో కూడా సుఖశాంతులు ఉంటాయి.