pregnancy & parenting
ప్రతి పేరెంట్స్ పిల్లలకు చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ నేర్పాలి. గారాభంగా పెంచితే పిల్లలు మొండిగా, పట్టుదలగా ఉంటారు. చెప్పిన మాట అస్సలు వినరు.
పిల్లలంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే. అందుకే పేరెంట్స్ పిల్లలు అడిగిందల్లా కొనిస్తుంటారు. ముద్దు చేస్తుంటారు. కానీ పిల్లల ప్రతి కోరికను నెరవేర్చడం వల్ల వాళ్లు మొండిగా అవుతారు.
పిల్లలకు సరైన దినచర్య లేకపోయినా, క్రమశిక్షణ లేకుండా పెరిగినా మొండిగా ప్రవర్తిస్తారు. తల్లిదండ్రుల మాటను కేర్ చేయరు.
ఎక్కువ ముద్దు చేయడం, మరీ కఠినంగా వ్యవహరించడం వల్ల కూడా పిల్లలు మొండిగా అవుతారు. ఇలాంటి వెదర్ లో పెరిగిన పిల్లలు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు.
ప్రతి పేరెంట్స్ పిల్లలకు స్వంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఇవ్వాలి లేదంటే వాళ్లు మొండిగా మారతారు.
మీకు తెలుసా? తల్లిదండ్రులు పిల్లల పట్ల శ్రద్ధ చూపకపోయినా కూడా మొండిగా అవుతారు. ఎందుకంటే తల్లిదండ్రుల దృష్టిని ఆకర్షించడానికి ఇలా చేస్తారు. పేరెంట్స్ పిల్లల పట్ల శ్రద్ధ చూపాలి.
మితిమీరిన రక్షణ కూడా పిల్లల్ని మొండివారయ్యేలా చేస్తుంది. ఎందుకంటే ఇది పిల్లలు కొత్త విషయాలను నేర్చుకునే అవకాశాలను తగ్గిస్తుంది.
పిల్లలు తల్లిదండ్రుల నుంచి ప్రోత్సాహాన్ని ఆశిస్తారు. ఇదేలేకపోతే వారు మొండిగా అవుతారు. పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ, క్రమశిక్షణతో కూడిన వాతావరణం చాలా అవసరం.