Lifestyle
ప్రతిరోజు వాడే దిండు శుభ్రత గురించి శ్రద్ధ తీసుకుంటున్నారా?
దుప్పట్లు, దిండు కవర్లు వారానికి ఒకసారైనా మార్చి కొత్తవి, శుభ్రంగా ఉతికినవి వేయడం చాలా ముఖ్యం.
ఉతకని దిండు కవర్లలో టాయిలెట్ సీటు కంటే ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందని కొత్త అధ్యయనంలో తేలింది.
బెడ్ షీట్లు, దిండు కవర్లు సరిగ్గా శుభ్రం చేయకపోతే బ్యాక్టీరియా పేరుకుపోతుంది.
ఉతకని దిండు కవర్లలో హానికరమైన బ్యాక్టీరియా, ఫంగస్ ఉంటాయి. ఇది అలర్జీలకు దారితీస్తుందని నేషనల్ స్లీప్ ఫౌండేషన్ తెలిపింది.
ఉతకని దిండు వాడటం వల్ల శ్వాస సమస్యలు, ఇన్ఫెక్షన్లు వస్తాయి.
దిండు కవర్లలో నూనె, చెమట, బ్యాక్టీరియా ఉంటాయి.
తడి, మురికి వస్తువుల్లో బూజు లేదా ఈస్ట్ పెరిగితే రింగ్వార్మ్ వంటి ఫంగస్ ఇన్ఫెక్షన్లు వస్తాయి.