Lifestyle

చాణక్య నీతి ప్రకారం.. ఏది ఏమైనా ఈ పనులను మాత్రం వెంటనే చేయాలి

సమయానికి ఏ పనులు చేయాలి

ఆచార్య చాణక్య నీతి ప్రకారం.. ఎన్ని పనులు ఉన్న నాలుగు పనులను మాత్రం సమయానికే చేయాలి. లేదంటే మీరు ఎంతో కోల్పోవాల్సి వస్తుంది. ఆ 4 పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

సమయానికి అప్పు తీర్చండి

మీరు ఏ రకమైన అప్పు తీసుకున్నా సరే సమయానికి తీర్చాలి. లేదంటే తర్వాత వడ్డీతో మీరు ఇబ్బందులో పడతారు. అందుకే అప్పులను ఎప్పుడైనా సరే సమయానికల్లా కట్టేయాలి. 

ఆరోగ్య సంబంధిత పనులు

ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఆరోగ్యం విషయంలో లేజీగా ఉండకూడదు. మీకు ఏదైనా సమస్య ఉంటే డాక్టర్ కు చూపించుకోండి. టైంకి చికిత్స తీసుకోకపోతే అది పెద్ద వ్యాధిగా మారొచ్చు.

దానధర్మాలు

దానధర్మాలు ఎంతో మంచి పనులు. మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు. కాబట్టి మీరు చేసే మంచి పనులే మీకు పరలోకంలో ఉపయోగపడతాయి.

ఏ పనీ వాయిదా వేయకండి

కొంతమంది ఈ రోజు, రేపు, ఎల్లుండి అంటూ పనులను వాయిదా వేసుకుంటూ వెళతారు. కానీ ఇది అస్సలు మంచిది కాదు. కాబట్టి పనులను వాయిదా వేయకుండా ఎప్పటికప్పుడే పూర్తి చేయండి. 

ఆడవాళ్లకు షుగర్ ఉంటే ఏమౌతుందో తెలుసా

రోజూ ఇడ్లీ తింటే ఏమౌతుంది?

ఇల్లీగల్ అఫైర్స్ తప్పేం కాదు: వ్యభిచార చట్టం రద్దు చేసిన కోర్టు

షుగర్ లేకుండా కాఫీ తాగితే ఏమౌతుంది?