Lifestyle
తెల్ల జుట్టు నల్లగా కనిపించడానికి చాలా మంది హెయిర్ కలర్ వాడుతుంటారు. కానీ ఈ రంగు వేసేటప్పుడు కొన్ని తప్పులు చేస్తే మీ జుట్టు ఊడిపోతుంది. అలాగే ఎన్నో సమస్యలు వస్తాయి.
ఎప్పుడైనా సరే మీ జుట్టుకు సరిపోయే కలర్ నే వాడాలి. దీంతో మీకు ఎలాంటి అలెర్జీ రాదు. ముఖ్యంగా హెయిర్ కలర్ వేసుకునే ముందు ఖచ్చితంగా ప్యాచ్ టెస్ట్ చేయించుకోవాలి.
ఎప్పుడైనా సరే జుట్టుకు రంగే వేసే ముందు జుట్టును వాష్ చేయకూడదు. ఎందుకంటే మన నెత్తిమీదుండే నేచురల్ ఆయిల్స్ చర్మానికి రక్షణ కల్పిస్తాయి. అందుకే కలర్ వేసుకోవడానికి ఒక రోజు ముందు కడగండి
జుట్టు ఊడిపోకూడదంటే.. రంగు వేసుకునే ముందు ఖచ్చితంగా కండిషనింగ్ చేయండి. ఇందుకోసం ఒక వారం ముందే కండిషనర్ ను వాడండి.
హెయిర్ కలర్ ను వేసుకున్న తర్వాత హీట్ స్టైలింగ్ ఉత్పత్తులను వాడటం మంచిది కాదు. దీనివల్ల జుట్టు ఊడిపోయే, నిర్జీవంగా మారే అవకాశం ఉంది.
జుట్టుకు రంగు ఎక్కువ రోజులు ఉండాలంటే మాత్రం మీరు రెగ్యులర్ గా వాడే షాంపూకు బదులుగా సల్ఫేట్ లేని షాంపూని వాడండి. అలాగే కండిషనర్ ను ఖచ్చితంగా వాడండి.