ఉల్లిపాయల ఘాటైన వాసన ఎలుకలకు నచ్చదు. ఎలుకలు తరుచు కనిపించే చోట ఉల్లిపాయ ముక్కలు లేదా తొక్కలు వేయండి.
లవంగాల వాసన కూడా ఎలుకలకు ఇష్టం ఉండదు. లవంగాలు లేదా లవంగ నూనె పూసిన దూదిని ఎలుకలు వచ్చే చోట పెట్టవచ్చు.
ఎలుకలను తరిమికొట్టడానికి బేకింగ్ సోడా కూడా ఉపయోగపడుతుంది. ఎలుకలు వచ్చే చోట బేకింగ్ సోడా చల్లితే సరి.
మిరియాల ఘాటైన వాసన ఎలుకలకు ఇబ్బంది కలిగిస్తుంది. ఎలుకలు వచ్చే చోట మిరియాల పొడి చల్లడం మంచిది.
కారం పొడి వాసనను పీల్చుకోవడానికి ఎలుకలు ఇబ్బందిపడుతాయి.
కర్పూర తులసి నూనె వాసన ఎలుకలకు నచ్చదు. ఎలుకలు వచ్చే చోట దీన్ని పూసిన దూది పెట్టవచ్చు. వాసన భరించలేక ఎలుకలు అటు రావు.
ఎలుకలను తరిమికొట్టడానికి పిల్లులను పెంచుకోవడం మంచి మార్గం. పిల్లి ఉంటే.. ఇంట్లోకి ఎలుకలు రావడం తగ్గుతుంది.