INTERNATIONAL
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి 8 రోజుల కోసం వెళ్లిన సునీతా సాంకేతిక సమస్యల కారణంగా ఏకంగా 9 నెలల పాటు ఉండాల్సి వచ్చింది.
దీంతో ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌తో చేతులు కలిపిన నాసా సునీత విలియమస్‌తో పాటు విల్మోర్‌ను భూమిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేయగా తాజాగా ఆ ప్రయత్నాలు ఫలిచ్చాయి.
అమెరికా కాలమాన ప్రకారం సునీత విలియమ్స్ మంగళవారం 5.57 గంటలకు భూమ్మీద ల్యాండ్ కానున్నారు. ఈ నేపథ్యంలో సునీత విలియమ్స్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సునీతా విలియమ్స్ తండ్రి దీపక్ పాండ్యా గుజరాత్ రాష్ట్రానికి చెందిన వారు. ఆమె తండ్రి న్యూరో అనాటమిస్ట్‌గా వైద్య వృత్తిని కొనసాగించారు.
దీపక్ పాండ్యాకు స్లోవేకియాకు చెందిన ఉర్సులైన్ బోన్ని పాండ్యాను వివాహం చేసుకొన్నారు. వారికి సునీతా, జేయ్ థామస్, దినా ఆనంద్ సంతానం కలిగారు.
సునీతా 1965, సెప్టెంబర్ 19న ఒహియోలో జన్మించారు. నీదమ్ హై స్కూల్ విద్యను 1983లో పూర్తి చేశారు. 1987లో యూఎస్ నావల్ అకాడమీ నుంచి ఫిజికల్ సైన్స్‌లో బ్యాచ్‌లర్ డిగ్రీ పూర్తి చేశారు.
ఫ్లోరిడా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మాస్టర్ డిగ్రీ సాధించిన సునీతా విలియమ్స్ 59 ఏళ్ల వయసులో అత్యధిక స్పేస్ వాక్స్ సాధించిన ఆస్ట్రోనాట్‌గా రికార్డు సృష్టించారు.
సునీతా విలియమ్స్, విల్మోర్‌ను క్రూ డ్రాగన్ వ్యోమనౌక ద్వారా భూమికి చేరుకోనున్నారు. భారత కాలమాన బుధవారం తెల్లవారు జామున 3.27 గంటలకు ఫ్లోరీడా సముద్ర జలాల్లో ల్యాండ్ అవుతారు.