రుచికోసం మాత్రమే కాదు, శుభ్రం చేయడానికీ ఉప్పుని వాడొచ్చు. ఉప్పుతో ఏమేం చేయొచ్చో తెలుసుకుందాం.
ఉప్పు తేమను పీల్చుకుంటుంది. చాపలు, కార్పెట్లలోని తేమను పోగొట్టడానికి ఉప్పు వాడొచ్చు.
పైపుల్లో అడ్డుపడే మలినాలు, నూనె మరకలను ఉప్పుతో తొలగించవచ్చు. కొంచెం ఉప్పు సింక్‌లో వేస్తే చాలు.
బట్టలపై చెమట, ఇంకు, టీ, నూనె మరకలను ఉప్పుతో తొలగించవచ్చు. ఉప్పుతో రుద్ది కడిగితే మరకలు పోతాయి.
చీమల బెడద ఉంటే.. ఉప్పుతో పరిష్కారం దొరుకుతుంది. నీళ్ళలో ఉప్పు కలిపి తుడిస్తే చాలు.
ఉల్లి, వెల్లుల్లి కోసినప్పుడు చేతులకు దుర్వాసన వస్తుంది. అలాంటప్పుడు ఉప్పు నీళ్ళలో చేతులు ఉంచితే చాలు.
షూస్ నీటిలో తడిసి దుర్వాసన వస్తాయనే విషయం తెలుసు. ఉప్పు వేసి ఆరబెడితే దుర్వాసన పోతుంది.
బట్టలపై చెమట మరకలు ఉప్పుతో పోతాయి. నీళ్ళలో నానబెట్టి ఉప్పుతో కడిగితే చాలు.