Health
ఎర్ర రక్త కణాలు ఆక్సిజన్‌ను మోసుకెళ్లడానికి ఐరన్ చాలా అవసరం.
ఐరన్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మం, జుట్టు, గోళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది.
శరీరంలో ఐరన్ స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు కనిపించే 5 లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకోండి.
సాధారణంగా కాళ్లు, చేతులు వెచ్చగా ఉంటాయి. కాని ఐరన్ లోపం ఉంటే వారి కాళ్లు, చేతులు చల్లగా ఉంటాయి.
ఐరన్ లోపం ఉన్న వారు కాస్త పనికే అలసిపోతారు. ఎప్పడూ నీరసంగా ఉంటారు. ఏ పనీ చేయాలనిపించదు.
ఊపిరి ఆడకపోవడం, బలంగా ఊపిరి తీసుకోవడం లాంటి లక్షణాలు కూడా శరీరంలో ఐరన్ స్థాయిలు తక్కువగా ఉండడానికి ఒక కారణం.
మీకు తరచుగా తలనొప్పి వస్తోందా? అయితే మీ శరీరంలో ఐరన్ స్థాయిలు తక్కువగా ఉన్నాయని అర్థం.
ఐరన్ లోపం ఉన్న వారి గోళ్లు చాలా బలహీనంగా ఉంటాయి. అంటే నెయిల్ కటర్ అవసరం లేకుండానే విరిగిపోతాయి.