మీరు రాత్రి సరిగ్గా నిద్రపోకపోతే ఒత్తిడి హార్మోన్ పెరుగుతుంది. కిడ్నీలపై ఒత్తిడిని కలిగించి, వాటి పనితీరును ప్రభావితం చేస్తుంది.
నిద్రలేమి వల్ల రక్తపోటు అదుపు తప్పి, కిడ్నీలపై చెడు ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మూత్రం వడపోత బలహీనపడుతుంది.
రాత్రి ఎక్కువసేపు నిద్రపోకపోతే కిడ్నీ పనితీరు మందగిస్తుంది. దీనివల్ల శరీరంలో విష పదార్థాలు పేరుకుపోతాయి.
నిద్రలేమి వల్ల శరీరంలో ఇన్సులిన్ ప్రభావం తగ్గి షుగర్ లెవల్స్ ని ప్రభావితం చేస్తుంది. దీనివల్ల డయాబెటిక్ కిడ్నీ వ్యాధి ప్రమాదం పెరుగుతుంది.
తక్కువ నిద్ర వల్ల కిడ్నీలు దెబ్బతింటాయి. కొన్నిసార్లు మూత్రం ద్వారా ప్రోటీన్ బయటకు వెళ్లిపోతుంది. దీనివల్ల కిడ్నీ సమస్య వస్తుంది.
ప్రతిరోజూ ఆలస్యంగా పడుకుంటే కిడ్నీ కణజాలం దెబ్బతిని వాపు వంటి సమస్యలు వస్తాయి.
మీకు ఇప్పటికే డయాబెటిస్, అధిక రక్తపోటు, కిడ్నీ సమస్య ఉంటే సరిగ్గా నిద్రపోకపోతే జాగ్రత్తగా ఉండండి.