విటమిన్ సి ఉన్న నిమ్మకాయ లాంటి సిట్రస్ పండ్లు తినడం, నిమ్మరసం తాగడం వల్ల యూరిక్ యాసిడ్ తగ్గుతుంది.
పొటాషియం ఉన్న అరటిపండు తినడం వల్ల యూరిక్ యాసిడ్ తగ్గుతుంది.
విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఉన్న చెర్రీస్ తినడం వల్ల యూరిక్ యాసిడ్ తగ్గుతుంది.
నీరు అధికంగా ఉండి ప్యూరిన్లు తక్కువగా ఉన్న దోసకాయ తినడం వల్ల యూరిక్ యాసిడ్ తగ్గుతుంది.
పసుపులో కర్కుమిన్ ఉంటుంది. దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి యూరిక్ యాసిడ్‌ను తగ్గిస్తాయి.
అల్లంలోని జింజెరాల్‌కు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది శరీరంలోని యూరిక్ యాసిడ్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.
యాంటీఆక్సిడెంట్లు ఉన్న గ్రీన్ టీ తాగడం వల్ల యూరిక్ యాసిడ్ తగ్గుతుంది.