Food
కూరలో ఉప్పు ఎక్కువైతే కొబ్బరి పాలు తీసి కలపండి. శనగల కూర లేదా చికెన్ కరీ అయితే కొబ్బరి పాలు రుచిని పెంచుతాయి.
చక్కెర తీపి ఒక మోతాదు వరకు ఉప్పును తగ్గిస్తుంది. కూరలో ఉప్పు ఎక్కువగా ఉంటే చిటికెడు పంచదార వేస్తే సరిపోతుంది.
ఉడికించిన బంగాళదుంప వేయడానికి వీలైన కూర అయితే, ఉడికించి మెత్తగా చేసి వేయవచ్చు. ఇది కూడా ఉప్పును తగ్గిస్తుంది.
గోధుమ పిండిని కలిపి చిన్న ఉండలు చేసి కూరలో వేయండి. తర్వాత ఈ ఉండలను కూర నుంచి తీసేయవచ్చు.
కూరలో ఉప్పు ఎక్కువైతే, కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ కలపండి. ఇది ఉప్పును తగ్గించడమే కాకుండా, కూర రుచిని కూడా పెంచుతుంది.
ఉప్పు ఎక్కువగా ఉన్న కూరల్లో ఉల్లిపాయను గుండ్రంగా తరిగి కలపండి. ఉప్పును పీల్చుకుంటుంది.