Food
ఆలు పరోఠా మరింత టేస్టీగా రావాలంటే సరైన మోతాదులో ఉప్పు వేయడంతో పాటు ఎప్పుడు వేస్తున్నామనేది కూడా ముఖ్యం.
పరోఠా పైపొర రుచిగా ఉండాలంటే పిండి కలిపేటప్పుడు కొంచెం ఉప్పు, నెయ్యి లేదా వెన్న వేయండి. ఇలా చేస్తే పిండి మెత్తగా ఉంటుంది.
ఆలూ మిశ్రమంలో ఎప్పుడూ ముందుగా ఉప్పు వేయకూడదు. పరోఠా చేసే ముందు ఉప్పు వేసి బాగా కలిపి వెంటనే స్టఫ్ చేయాలి.
ఆలూ పరోఠాలో ముందుగా ఉప్పు వేసి నిల్వ చేస్తే అది తేమను విడుదల చేస్తుంది. దీనివల్ల పరోఠా చేసేటప్పుడు విరిగిపోతుంది. సరిగ్గా రాదు.
ఆలూ పరోఠాలో ఉప్పు ఎక్కువైతే కొంచెం పనీర్ వేయండి. లేదా ఆమ్చూర్ పొడి వేసి ఉప్పును బ్యాలెన్స్ చేయండి.