Food
మంచి ఆరోగ్యం కోసం సరైన ఆహారాలు తీసుకోవడం చాలా అవసరం.
కొన్ని ఆహారాలు ఖాళీ కడుపుతో తింటే జీర్ణ సమస్యలు, యాసిడ్ రిఫ్లక్స్ వస్తాయి. కొన్ని ఆహారాలు జీర్ణక్రియను, జీవక్రియను దెబ్బతీస్తాయి.
ఖాళీ కడుపుతో తినకూడని ఐదు రకాల ఆహారాలు.
అరటిపండు ఆరోగ్యానికి మంచిదే కానీ, ఖాళీ కడుపుతో తినడం అంత మంచిదేమీ కాదు.
అరటిపండులో మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది. ఇది శరీరంలోని కాల్షియం, మెగ్నీషియం సమతుల్యతను దెబ్బతీస్తుంది.
ఖాళీ కడుపుతో పెరుగు తింటే కడుపులోని మంచి బాక్టీరియాలు చనిపోతాయి. దీనివల్ల గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి.
నారింజ, నిమ్మ, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లలో సిట్రిక్ యాసిడ్ ఎక్కువ. ఖాళీ కడుపుతో ఈ పండ్లు తింటే కడుపులో ఎసిడిటీ పెరుగుతుంది.
గ్యాస్ట్రిక్ సమస్యలు లేదా అల్సర్ ఉన్నవాళ్లు ఉదయం పుల్లటి పండ్లు తినడం మానేయాలి.
చాలామంది రోజును టీ లేదా కాఫీతో మొదలుపెడతారు. కానీ ఇది మంచిది కాదు.
ఈ పానీయాల్లోని కెఫీన్ ఖాళీ కడుపుతో కడుపులో ఎసిడిటీని పెంచుతుంది. దీనివల్ల వాపు, నొప్పి వస్తాయి.