Food
ఖర్జూరం వేడి గుణం కలిగి ఉంటుంది. కాబట్టి దీన్ని రాత్రి నీటిలో నానబెట్టి ఉదయం తినడం మంచిది.
వేసవిలో ఎండు ఖర్జూరం తింటే శరీర ఉష్ణోగ్రత పెరిగి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
వేసవిలో ఎండు ఖర్జూరం తింటే శరీరంపై దద్దుర్లు, దురద, ఎరుపు, కళ్లలో నీరు కారడం వంటి అలెర్జీ సమస్యలు వస్తాయి.
వేసవిలో వచ్చే మలబద్ధకాన్ని తగ్గించుకోవడానికి ఖర్జూరాన్ని నీటిలో నానబెట్టి తినండి. వెంటనే ఉపశమనం కలుగుతుంది.
వేసవి వేడి వల్ల శరీరంలో శక్తి తగ్గిందనిపిస్తే నీటిలో నానబెట్టిన ఖర్జూరం తినండి. శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది.
వేసవిలో నానబెట్టిన ఖర్జూరం తింటే జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.