Entertainment
విజయలక్ష్మి వదలపతి డిసెంబర్ 2, 1960న జన్మించారు. ఈరోజు ఆమె 64వ జయంతి.
సిల్క్ స్మిత తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో నటించారు. 1980లో 'వందిచక్కరం ' సినిమాతో ఆమె తెరంగేట్రం చేశారు.
'వందిచక్కరం ' సినిమాలో సిల్క్ అనే పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ పేరుతోనే ఫేమస్ అయ్యారు.
సిల్క్ స్మిత బోల్డ్ పాత్రలు, ఐటెం సాంగ్స్ తో గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమా విజయం కోసం నిర్మాతలు ఆమెను ఎక్కువగా ఇలాంటి పాత్రలకే ఎంచుకునేవారు.
16 ఏళ్ల కెరీర్ లో 500కు పైగా సినిమాల్లో నటించారు. 1983లో ఒక్క ఏడాదిలోనే 45 సినిమాలు చేశారు. చాలా వరకు చిన్న పాత్రలే.
80, 90 దశకాల్లో సిల్క్ స్మిత చాలా ఫేమస్. చాలామంది ఆమెను ఆసరాగా చేసుకుని వాడుకున్నారు.
14 ఏళ్లకే సిల్క్ స్మితకు ఒక ఫ్యాక్టరీ కార్మికుడితో పెళ్లయింది. భర్త వేధింపులకు గురయ్యారు.
1996 సెప్టెంబర్ 22న సిల్క్ స్మిత మరణించారు. చెన్నైలోని ఒక హోటల్ లో ఆమె మృతి చెందారు.
మరణానికి ముందు స్నేహితురాలు అనురాధతో సిల్క్ స్మిత తన సమస్యల గురించి మాట్లాడారు.
సిల్క్ స్మిత జీవితం ఆధారంగా 'ద డర్టీ పిక్చర్' అనే సినిమా వచ్చింది. విద్యా బాలన్ సిల్క్ పాత్రలో నటించారు.
అల్లు అర్జున్ టాప్ 5 సినిమాలు: ఒక్కటి కూడా 400 కోట్లు దాటలేదా?
ఈ విలన్ల భార్యలను చూశారా? అందంలో హీరోయిన్లకి తక్కువ కాదు
పుష్ప 2 తో పాటు డిసెంబర్ లో రిలీజ్ కాబోతున్న 8 క్రేజీ చిత్రాలు
సౌత్ ఇండస్ట్రీపై వివాదాస్పద కామెంట్లకి రాశీఖన్నా వివరణ ఇదే